ఏపీలో వరుసగా మూడో రోజూ 10 వేలకు పైగా కరోనా కేసులు

Published: Friday July 31, 2020

రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గడం లేదు. వరుసగా మూడో రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లో 61,699 మందికి రాష్ట్రవ్యాప్తంగా కరోనా పరీక్షలు చేశారు. à°ˆ పరీక్షల్లో 10,376 మందికి కొవిడ్-19à°—à°¾ తేలారు. à°ˆ రోజు నమోదయిన కేసులతో కలిపి మొత్తం1,40,933కు కరోనా కేసుల సంఖ్య చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 75,720 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కొవిడ్ నుంచి కోలుకుని 63,864 మంది డిశ్చార్జ్ అయ్యారు. 

 

శుక్రవారం కరోనాతో 68 మంది మృతి చెందారు. గుంటూరు జిల్లాలో పదమూడు మంది, అనంతపురం జిల్లా తొమ్మిది మంది, కర్నూలు జిల్లాలో ఎనిమిది మంది, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. ఇక ప్రకాశం జిల్లాలో ఆరుగురు, విశాఖపట్నం జిల్లాలో ఐదుగురు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో నలుగురు చొప్పున మృతి చెందారు. అంతేకాకుండా పశ్చిమగోదావరిలో ఇద్దరు మృతి చెందారు. à°•à°¡à°ª, కృష్ణ, విజయనగరం జిల్లాలో ఒకరు చొప్పున మరణించారు. 

 

అనంతపురం జిల్లాలో అత్యధికంగా 1387 కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో 1215, కర్నూలు జిల్లాలో 1124 కేసులు, విశాఖపట్నం జిల్లాలో 983, పశ్చిమగోదావరి జిల్లాలో 956, గుంటూరు జిల్లాలో 906, నెల్లూరులో 861, చిత్తూరు జిల్లాలో 789, కడప జిల్లాలో 646, ప్రకాశం జిల్లాలో 406, శ్రీకాకుళం జిల్లాలో 402, విజయనగరం జిల్లాలో 388, కృష్ణా జిల్లాలో 313 కరోనా కేసులు నమోదయ్యాయి.