తదుపరి లక్ష్యం ఆ రెండు దేవాలయాలే

Published: Monday August 03, 2020

అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేపడతామని ఆనాడే చెప్పామని, చెప్పిన మాటపై తాము నిలబడి... ఆ హామీని నెరవేర్చామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. అయోధ్యతో పాటు ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ అంశాలను కూడా రద్దు చేశామని, వీటితో పాటు అభివృద్ధి అంశాలతో కూడా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. అయోధ్య భూమి పూజకు ప్రధాని మోదీ హాజరు కావడంలో ఎలాంటి తప్పూ లేదని తేల్చి చెప్పారు.

 

భారత దేశంలో హిందువులు కూడా భాగమేనని, వారి గురించి కూడా ఆలోచించాల్సిన బాధ్యత ప్రధాని మోదీపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రామ మందిర ఉద్యమం ముగిసిందని, త్వరలోనే అక్కడ పూజలు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. తదుపరి లక్ష్యం మథుర, వారణాసి దేవాలయాలే అని ఆయన సంచలన ప్రకటన చేశారు.

 

à°† రెండు దేవాలయాల గురించి కూడా న్యాయ పోరాటం చేసి, గెలుస్తామని పేర్కొన్నారు. à°ˆ రెండు దేవాలయాల నిర్మాణం కూడా బీజేపీ హయాంలో జరుగుతుందని ఆయన ప్రకటించారు. à°†  దేవాలయాల భూమి పూజలకు కూడా ప్రధాని మోదీ హాజరవుతారని ఆయన పేర్కొన్నారు.  à°ˆ రెండు దేవాలయాలకు సంబంధించిన వ్యవహారం ప్రస్తుతం కోర్టులో ఉందని, వాటిపై విజయం సాధిస్తామని రాజా సింగ్  ధీమా వ్యక్తం చేశారు.