కొవిడ్-19 వ్యాక్సిన్ ముందు ఎవరికి

Published: Tuesday August 11, 2020

కొవిడ్-19 వ్యాక్సిన్ ఎవరికి ముందు ఇవ్వాలన్న దానిపై రేపు నిపుణులతో కూడిన à°“ కమిటీ సమావేశం కానుంది. కోవిడ్-19 వ్యాక్సిన్ సేకరణ, నిర్వహణతో పాటు పంపిణీ వ్యవహారాలపై à°ˆ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ‘‘కొవిడ్-19 వ్యాక్సిన్ నిర్వహణపై నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ à°ˆ నెల 12à°¨ సమావేశం కానుంది. రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యాక్సిన్ తయారీదారులు సహా అన్ని భాగస్వామ్య పక్షాలతో à°ˆ కమిటీ చర్చలు జరుపుతుంది. కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత దాన్ని ఎవరికి ముందు అందజేయాలన్న దానిపై నిపుణుల కమిటీ విధివిధానాలు రూపొందిస్తుంది..’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ ఇవాళ ట్విటర్లో వెల్లడించింది. వ్యాక్సిన్ విడుదల, కోల్డ్ చైన్ లాజిస్టిక్స్‌తో పాటు వ్యాక్సిన్ ఇచ్చే వారికి శిక్షణ అందించడంపై à°ˆ కమిటీ దృష్టిపెట్టనున్నట్టు తెలిపింది. 

 

కాగా దేశంలో ప్రస్తుతం మూడు కోవిడ్-19 వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో వివిధ దశల్లో ఉన్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్ బయోటెక్‌తో పాటు జైడస్ కాడిలా లిమిటెడ్ తయారుచేసిన వ్యాక్సిన్‌à°² ట్రయల్స్ రెండో దశలోకి ప్రవేశించాయని ఐసీఎంఆర్ డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ వెల్లడించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ రెండు, మూడు దశల క్లినికల్ ట్రయిల్స్‌ కోసం సెరుమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ)à°•à°¿ కూడా అనుమతి లభించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 22,68,675à°•à°¿ చేరుకోగా.. à°ˆ మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 45,257 మంది ప్రాణాలు కోల్పోయారు.