స్వర్ణ ప్యాలెస్ ప్రమాదంపై ప్రాథమిక నివేదిక..

Published: Friday August 14, 2020

నగరంలోని స్వర్ణ పాలెస్‌ కోవిడ్ సెంటర్‌లో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో వేసిన కమిటీ ప్రాథమిక నివేదిక వచ్చేసింది. à°ˆ నివేదికను నిశితంగా పరిశీలించిన అనంతరం రమేష్ ఆస్పత్రికి జగన్ సర్కార్ షాకిచ్చింది!. కాగా.. à°ˆ నివేదికతో పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. హోటల్ నిర్వహణలో ఆసుపత్రి యంత్రాంగం అవసరమైన జాగ్రత్తలు తీసుకోలేదని కమిటీ తేల్చింది. అంతేకాదు.. జీవో 77ను అతిక్రమించి ఆసుపత్రి యాజమాన్యం ఫీజులను భారీగా వసూలు చేశారని తేటతెల్లమైంది. à°ˆ క్రమంలో కోవిడ్ కేర్ అందించడంలో కేటగిరి-ఏ ట్రీట్మెంట్ అందించే అసుపత్రిగా ఉన్న రమేష్ ఆసుపత్రి అనుమతులను రద్దు చేస్తూ కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ ఉత్తర్వులు ఇచ్చారు. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు ఇవి అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఫైవ్ మెన్ కమిటీ హాస్పటల్ లో గుర్తించిన లోటుపాట్లను తెలియజేస్తూ కలెక్టర్ ఆసుపత్రికి నోటీసులు జారీ చేశారు. కమిటీ రిపోర్ట్ ఆధారంగా హోటల్‌లో కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని కలెక్టర్ తెలిపారు.

‘ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ నంబర్-77ను అతిక్రమించి కోవిడ్ బాధితుల నుంచి అధికంగా ఫీజులను వసూలు చేసింది. రూల్-9 ఏపీ అల్లోపతిక్, ప్రైవేట్ మెడికల్ కేర్ రిజిస్ర్టేషన్, రెగ్యులేషన్ రూల్స్‌ను రమేష్ హాస్పిటల్ పట్టించుకోలేదు. ఆసుపత్రి రిసెప్షన్‌లో అందిస్తున్న సేవల రేటు ఇంగ్లీష్‌లోనూ, తెలుగులోనూ ప్రదర్శించాలి. అలాంటి బోర్డును ఏదీ ఆసుపత్రి వద్ద ప్రదర్శించలేదు. మెట్రో పాలిటన్ హోటల్, à°Žà°‚- 5 హోటల్‌లో జిల్లా అధికారుల అనుమతి లేకుండా కోవిడ్ కేసులను జాయిన్ చేసుకుంది. డిఎంహెచ్‌వో క్యాంపు ఆఫీస్ వద్ద à°ˆ నెల 30లోపు కమిటీ గుర్తించిన అంశాలపై లిఖిత పూర్వక సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. వాదనలు వినిపించేందుకు న్యాయవాదిని ఏర్పాటు చేసుకుంటే విచారణకు వారం రోజుల ముందే తెలియజేయాలి. ఆసుపత్రి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను విచారణకు వచ్చే ముందు లేదా అదే రోజు తీసుకువచ్చి, స్వాదీనపరచాలి’ à°…ని కమిటీ ఆదేశించింది.