కరోనా కల్లోలం రేపుతున్న ఏపీకి ఇది గుడ్‌న్యూసే.

Published: Saturday August 15, 2020

ఆంధ్రప్రదేశ్‌‌లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. శనివారం నాటి హెల్త్ బులిటెన్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. ఏపీలో à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో.. ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,817à°•à°¿ చేరింది. à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1126 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో కలిపి ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 39,418à°•à°¿ చేరింది. చిత్తూరు జిల్లాలో 959, విశాఖపట్నం 894, అనంతపురం 851, కర్నూలు 734, శ్రీకాకుళం 638, పశ్చిమ గోదావరి 612, గుంటూరు 609, నెల్లూరు 572, విజయనగరం 561, ప్రకాశం 489, à°•à°¡à°ª 389, కృష్ణా జిల్లాలో 298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఏపీలో à°—à°¡à°šà°¿à°¨ 24 గంటల్లో కరోనా వల్ల 87 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,562à°•à°¿ చేరింది.

 

అయితే.. ఏపీలో కొత్తగా నమోదవుతున్న కరోనా కేసులతో పోల్చుకుంటే కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటం కొంత ఊరట కలిగించే విషయం. ఏపీలో రికవరీ రేటు రోజురోజుకూ మెరుగవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏపీలో గడచిన 24 గంటల్లో 8,732 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 10,414 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ గణాంకాల ప్రకారం.. కరోనా బారిన పడుతున్న వారి కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఇది కొంత వరకూ రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే విషయమే.