రాగల 3 రోజులు భారీ వర్షాలు

Published: Saturday August 15, 2020

అల్పపీడన ప్రభావంతో రాగల 3 రోజులు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, అలలు 3.5 నుంచి 4.3 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని కన్నబాబు హెచ్చరించారు.

 

16à°µ తేది (ఆదివారం) విశాఖ, తూర్పు , పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది. రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. 17à°µ తేది (సోమవారం)  విజయనగరం, విశాఖ జిల్లాలో అక్కడక్కడ  భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ ప్రకటించింది. 18à°µ తేది (మంగళవారం) శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల శాఖ తెలిపింది.