డాక్టర్‌ పట్టా తీసుకున్న వెంటనే కరోనా పేషంట్లకు స్వచ్ఛంద సేవలు

Published: Monday August 17, 2020

‘‘మనదేశంలో కొవిడ్‌ విధులు నిర్వహించడానికి ముందుకు వచ్చిన తొలి వాలంటీర్లలో నేను కూడా ఒకదాన్ని. ఏప్రిల్‌లో కొవిడ్‌ విధుల్లో చేరా. నా జీవితంలో తీసుకున్న అత్యున్నత నిర్ణయం ఇది. పీపీఈ కిట్లు ధరించి ముంబయి వర్లీలోని ఎన్‌ఎస్‌సీఐ స్టేడియంలో కొవిడ్‌ పేషంట్లకు సేవలు అందించా. అన్ని రక్షణ జాగ్రత్తలు తీసుకుంటూ విధులు నిర్వహించా. కరోనా పేషంట్లకు సేవలు అందించేటప్పుడు డాక్టరువైపు, పేషంట్ల వైపు ఉండే కష్టాలు, ఇబ్బందులు రెండిటిపై నాకు అవగాహన ఏర్పడింది. నా పేషంట్లు నన్ను à°ˆ విషయంలో మంచి డాక్టరును చేశారు. à°† క్రెడిట్‌ వారికే చెల్లుతుంది. ప్రతి కొవిడ్‌ పేషంటు రకరకాల భావోద్వేగాలతో ప్రయాణిస్తున్నవారే. వారికి ముందుగా ధైర్యాన్ని అందించాలనుకున్నా. అందుకే నేను వారిని ముట్టుకుంటూ వైద్య సలహాలు, సూచనలు ఇచ్చేదాన్ని. వైద్యుల స్పర్శ రోగుల్లో ఎంతటి ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తుందో మాటల్లో చెప్పలేం. కొవిడ్‌ పేషంట్లు ఇంటికి, తమవాళ్లకు దూరమై ఉంటారు. వారి దగ్గరకు ఎవరూ రారు. వారి పరిస్థితిని అర్థం చేసుకుని నేను కొవిడ్‌ పేషంట్లను ట్రీట్‌ చేసేటప్పుడు వారి భుజం తడుతూ, కౌన్సిలింగ్‌ ఇస్తుంటా. అలా రెండున్నర నెలలు ఏకధాటిగా కొవిడ్‌ సేవలు అందించి జూన్‌లో మా ఇంటికి వెళ్లా. 

 

కరోనా బారిన పడ్డా...

ఇంటికి వెళ్లిన తర్వాత మాకు బాగా తెలిసిన ఒకరు జబ్బుపడితే నా అవసరం పడింది. దాంతో వారింటికి వెళ్లా. అక్కడే నేను ఇన్ఫెక్షన్‌కు గురయ్యా. అదే సమయంలో మా నానమ్మ కూడా చనిపోయారు. ఆమె మంగళూరులో ఉంటారు. వీడియోకాల్‌లో నేను ఆమెతో మాట్లాడుతూనే ఉన్నా. హఠాత్తుగా మా నానమ్మ కుప్పకూలిపోయింది. à°ˆ ఘటన మానసికంగా నామీద తీవ్ర ప్రభావం చూపింది. దానికి తోడు  పీపీఈ కిట్‌ను à°—à°‚à°Ÿà°² తరబడి ధరించి కొవిడ్‌ విధులు నిర్వర్తించడం వల్ల నా ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి. నాకు ఆస్తమా ఉంది. దానికి తోడు కరోనా ఎటాక్‌ చేసింది. దాంతో ఆస్పత్రిలో జాయినయ్యా. అప్పటికే నా ఊపిరితిత్తులు 20 శాతం దెబ్బతిన్నాయి. మా అమ్మకు కూడా కరోనా సోకింది. అయితే అదృష్టవశాత్తు ఆమె ఆస్పత్రి పాలవ్వలేదు. మూడురోజులు ఐసీయూలో ఉన్న తర్వాత నన్ను సాధారణ వార్డుకు మార్చారు. ప్రస్తుతం నేను కరోనా నుంచి కోలుకొని ఇంట్లోనే ఉన్నా. 

పేషంట్‌à°—à°¾ ఉన్నప్పటికీ డాక్టర్‌à°—à°¾...

ఐసీయూలో నేను 75 ఏళ్ల వృద్ధురాలితో రూమ్‌ షేర్‌ చేసుకున్నా. ఆమె పేరు కూడా నా పేరులాగే ఉంటుంది. పేరు హన్సా. పేషంట్‌à°—à°¾ ఉన్నప్పటికీ, నేను అక్కడ కూడా డాక్టర్‌à°—à°¾ నా విధులు మరవలేదు. వార్డులో రోజూ డయాలసిస్‌ అవసరమున్న ఇద్దరు ముగ్గురు సీనియర్‌ సిటిజన్స్‌ బాగోగులను చూసేదాన్ని. ‘ఎన్‌ఎస్‌సీఐ’లో కరోనా పేషంట్లను చికిత్స చేసిన అనుభవం నాకు ఇక్కడ కూడా పనికొచ్చింది. వార్డులోని అందరికీ ధైర్యం చెబుతూ ఉండేదాన్ని. ఫిజియోథెరపిస్ట్‌ ద్వారా కొన్ని ఎక్సర్‌సైజులు నేర్చుకున్నా. ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి చెస్ట్‌ ఫిజియోథెరపీ బాగా పనికొస్తుంది. దాన్ని వారిపై ప్రయోగించి మెరుగైన ఫలితాలు రాబట్టాను. వారంతా రెండు రోజుల తర్వాత    సాధారణ వార్డులోకి మారే ముందు  నాకు కృతజ్ఞతలు చెప్పారు.  

వైద్య కుటుంబాలూ యుద్ధం చేస్తున్నాయి...

వైద్యులం కాబట్టి రకరకాల జబ్బులతో ఉన్న రోగులను కలుస్తుంటాం. వారికి చికిత్స చేస్తుంటాం. నేను à°’à°• ఏడాది పాటు మున్సిపల్‌ ఆస్పత్రిలో కూడా పనిచేశా. అక్కడ టీబీకి, నీడిల్‌ స్టిక్‌ గాయాలకు బాగా లోనయ్యేవాళ్లం. కరోనా విషయంలో కూడా మా కుటుంబాన్ని రిస్క్‌లో పెడుతున్నాననే విషయం నాకు తెలుసు. ఇలాంటి ప్రమాదం ఉంటుందని తెలిసినా డాక్టర్‌à°—à°¾ నా కర్తవ్యం నిర్వర్తించాలనే తపనే నన్ను ఫ్రంట్‌ వారియర్‌à°—à°¾ నిలిపింది. నేను హాస్పిటల్‌లో ఉన్నప్పుడు అమ్మను కూడా చూసుకునే బాధ్యత ఉంది కదాని అనిపించేది. అయితే మనం యుద్ధానికి వెళ్లినపుడు కుటుంబసభ్యులను మనతోపాటు తీసుకువెడతాం. అంటే ఇది మనతో మనం చేస్తున్న యుద్ధం మాత్రమే కాదు... మన కుటుంబాలు సైతం యుద్ధం చేస్తున్నాయి. అలాంటి త్యాగాన్ని కోవిడ్‌ పేషంట్లకు సేవలు అందిస్తున్న వైద్యులు చేస్తున్నారు.