తగ్గుముఖం పట్టిన వరద

Published: Wednesday August 19, 2020

గోదావరి శాంతిస్తోంది. భద్రాచలం, ధవళేశ్వరంల వద్ద వరద తగ్గుముఖం పట్టింది. కానీ, నీరంతా కోనసీమను ముంచెత్తడంతో అక్కడ ఇంకా వరద పెరుగుతోంది. అమావాస్యకు సముద్రం పోటు ఎక్కువ ఉంటుందని, అందువల్ల బిగింపు ఎక్కువ కావడంతో వరద నీరు సముద్రంలో వేగంగా కలవదని అధికారులు చెబుతున్నారు. మంగళవారం రాత్రి 8 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి 22,29,482 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది. బ్యారేజీ గేజ్‌ 19.70 అడుగులు, పాండ్‌ లెవెల్‌ 16.67 మీటర్లుగా ఉంది. ధవళేశ్వరం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద తీవ్రత ఇలాగే కొనసాగితే బుధవారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. భద్రాచలం వద్ద సోమవారం 61.60 అడుగులున్న నీటిమట్టం మంగళవారానికి 51.50 అడుగులకు తగ్గింది. విలీన మండలాలు, దేవీపట్నం వద్ద కూడా వరద తగ్గుముఖం పట్టింది. కానీ, కోనసీమకు ఇంకా నాలుగు రోజులు ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. పోలవరం వద్ద పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. పురుషోత్తపట్నం ఎత్తిపోతల సమీపంలో ఏటిగట్టు కోతకు గురైంది. 

రాజమహేంద్రవరం-కొవ్వూరు మధ్య à°…à°–à°‚à°¡ గోదావరి మధ్యలో ఎదుర్లమ్మ లంక ఉంది. ఇక్కడ సుమారు 35 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. లంక ఎత్తుగా ఉండటంతో వారంతా సోమవారం అక్కడే ఉండిపోయారు. రాత్రికి వరద  పెరగడంతో సామగ్రి సహా గుడిసెలను పీకి పడవల మీద వేసుకుని పిల్లాపాపలతో పడవలపైనే జాగారం చేశారు.