వైరస్‌ సోకిన 99 శాతం మందిలో ఎలాంటి లక్షణాలూ లేవు

Published: Monday August 24, 2020

ముందున్నది మరింత తీవ్రత! కరోనా వచ్చింది కొందరికే! రానున్నది మరెందరికో! ఇది... రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జరిగిన ‘సీరో సర్వే’ ఫలితాలు చెబుతున్న విషయం!  కరోనా వైరస్‌ వ్యాప్తిని అంచనా వేసేందుకు ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను అనుసరించి అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ‘సీరో సర్వే’ నిర్వహించారు. జిల్లాకు 3750 మంది చొప్పున... నాలుగు జిల్లాల్లో 15 వేల మంది నుంచి నమూనాలు సేకరించి పరీక్షించారు. à°ˆ ఫలితాలతో ఆదివారం తుది నివేదికను రూపొందించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... కృష్ణా జిల్లాల్లో అత్యధికంగా 21.7 శాతం మంది రక్త నమూనాల్లో కరోనా వైరస్‌ సంబంధిత యాంటీ బాడీలు కనిపించాయి.

 

à°† తర్వాత అనంతపురం జిల్లాలో 16.7 శాతం, తూర్పు గోదావరిలో 14.4 శాతం, కనిష్ఠంగా నెల్లూరు జిల్లాలో 8.2 శాతం మందిలో ‘సీరో’ కనిపించింది. అంటే... నాలుగు జిల్లాల్లో సగటున 15.2 శాతం మందికి కరోనా వైరస్‌ సోకి, వెళ్లిపోయిందన్న మాట! మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే...  యాంటీ బాడీస్‌ ఉన్న వారిలో 99 శాతం మందికి అసలు వైర్‌సకు సంబంధించిన లక్షణాలేవీ (అసింప్టమెటిక్‌) కనిపించలేదు. అనంతపురంలో 99.5 శాతం మంది, కృష్ణాలో 99.4 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. తూర్పు గోదావరిలో మాత్రం 7.2 శాతం మందిలో వైరస్‌ లక్షణాలు కనిపించాయి.