రాష్ట్రంలో మరో 10,392 కేసులు.. 72 మరణాలు

Published: Thursday September 03, 2020

రాష్ట్రంలో కరోనా విలయం కొనసాగుతోంది. రోజూ వేలకు వేల కేసులు బయటపడుతుండడంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4.5 లక్షల మార్కుని దాటేసింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం వరకు 60,804 శాంపిల్స్‌ను పరీక్షించగా 10,392 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,55,531à°•à°¿ చేరింది.

 

తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,199 కేసులు బయటపడ్డాయి.  చిత్తూరులో 1,124, నెల్లూరులో 942, గుంటూరులో 900, పశ్చిమగోదావరిలో 885 కేసులు చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మరో 8,454 మంది కరోనా నుంచి కోలుకోగా మొత్తం రికవరీల సంఖ్య 3,48,330à°•à°¿ పెరిగింది. బుధవారం మరో 72 మంది కరోనాకు బలయ్యారు. నెల్లూరులో 11, చిత్తూరులో 10, పశ్చిమగోదావరిలో 9, ప్రకాశంలో 8, కృష్ణాలో 6, విశాఖపట్నంలో 6, అనంతపురంలో 4, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 4, శ్రీకాకుళంలో 4, విజయనగరంలో 3, కడపలో ఇద్దరు, కర్నూలులో ఒక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,125à°•à°¿ పెరిగింది.

 

జాతీయ స్థాయిలో పాజిటివ్‌ కేసులతో పాటు పాజిటివిటీ రేటులోనూ ఏపీ రెండో స్థానంలోకి వెళ్లింది. ఆయా రాష్ట్రాల్లో చేసిన పరీక్షలు, నమోదైన కేసుల ఆధారంగా పాజిటవీటీ రేటును నిర్ధారిస్తారు. జాతీయ స్థాయిలో పాజిటివీటీ రేటులో మహారాష్ట్ర (19.19 శాతం) మొదటి స్థానంలో నిలవగా.. ఏపీ 11.85 శాతంతో రెండో స్థానంలోనూ, 11.80 శాతంతో కర్ణాటక మూడో స్థానంలోనూ ఉన్నాయి.

 

మంగళవారం వరకూ పాజిటివీటీ రేటులో ఏపీ మూడో స్థానంలో ఉండేది. కానీ బుధవారం పది వేలకుపైగా కేసులు నమోదవడంతో కర్ణాటకను వెనక్కునెట్టి రెండో స్థానానికి చేరుకుంది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 38 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4.55 లక్షల మందికి పాజిటివ్‌ నిర్థారణ అయింది.