కరోనా విజృంభణతో కలకలం

Published: Wednesday September 09, 2020

తూర్పుగోదావరి జిల్లాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రాష్ట్రంలోనే అత్యధికంగా à°ˆ జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 70వేలకు చేరువైంది. మరోవైపు రాష్ట్రంలో 24à°—à°‚à°Ÿà°² వ్యవధిలోనే మరో పదివేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. సోమవారం 70,993 మందికి పరీక్షలు నిర్వహించగా 10,601 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 1,457 కేసులు, తూర్పుగోదావరిలో 1,426, చిత్తూరులో 1,178, పశ్చిమగోదారిలో 1,122, నెల్లూరులో 1,042 కేసులు వెలుగు చూశాయి. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 5,17,094కు చేరాయి. తాజాగా 11,691 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 4,15,765 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకూ మరో 73మంది మృత్యువాత పడ్డారు. గుంటూరులో పదిమంది, అనంత, చిత్తూరు జిల్లాల్లో 8మంది చొప్పున, à°•à°¡à°ª, ప్రకాశం జిల్లాల్లో ఏడుగురు చొప్పున, నెల్లూరు, విశాఖ జిల్లాల్లో ఆరుగురు చొప్పున, తూర్పుగోదావరి, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున, శ్రీకాకుళంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, విజయనగరంలో ఒక్కరు చొప్పున మృతిచెందారు.

 

మొత్తంగా రాష్ట్రంలో 4,560మందిని కరోనా బలి తీసుకుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఒకేరోజు 1,426 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌à°² సంఖ్య 69,686కు చేరింది. ఇప్పటి వరకు 435మంది మృతిచెందారు. కర్నూలు జిల్లాలో మరో 514మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వీటితో కలిపి జిల్లాలో బాధితుల సంఖ్య 49,216 కాగా 401మంది మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో మరో 1,122 కేసులు నమోదయ్యాయి. వీటిలో తణుకులో 130, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లులో 50వరకూ వెలుగు చూశాయి. నెల్లూరు జిల్లాలో మరో 1,042 కేసులు రికార్డుకెక్కాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 41,435కు చేరుకున్నాయి. గుంటూరులో 702, విజయనగరంలో 598,  శ్రీకాకుళంలో 505, అనంతపురంలో 441, విశాఖలో 426, కృష్ణాజిల్లాలో 389 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.