మొదటి స్థానంలో నిలిచిన భారత్

Published: Monday September 14, 2020

ప్రపంచంలోనే అత్యధిక కొవిడ్-19 రికవరీ రేటు నమోదైన దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. దేశంలో కరోనా బాధితులు భారీ సంఖ్యలో కోలుకుంటున్నారని.. దీంతో కొవిడ్-19 రికవరీ రేటు 78 శాతానికి చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ చెబుతోంది. à°—à°¡à°¿à°šà°¿à°¨ 24 గంటల్లోనే దేశవ్యాప్తంగా 77,512 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. మహరాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రికవరీ రేటు ఎక్కువగా ఉన్నట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే కరోనా కేసుల్లో బ్రెజిల్‌ను అధిగమించి అత్యధిక కేసులు నమోదైన దేశంగా మూడో స్థానం నుంచి భారత్ రెండో స్థానానికి చేరింది. అయితే తాజాగా రికవరీల్లోనూ భారత్ బ్రెజిల్‌ను దాటేసి అత్యధిక రికవరీ రేటు ఉన్న దేశంగా రికార్డు కొట్టింది. 

 

 

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు కోటి 96 లక్షల 25 వేల 959 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇందులో భారత్ నుంచే అత్యధికంగా 37,80,107 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటి లెక్కలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలోనూ రికవరీ రేటు ఇంతలా లేదని à°ˆ రిపోర్టులు చెబుతున్నాయి. ఇక భారత్ తరువాత బ్రెజిల్‌లో మొత్తం 37,23,206 మంది కరోనాతో పోరాడి గెలిచారు. కాగా.. భారత్‌లో ఇప్పటివరకు మొత్తం 48,46,427 కరోనా కేసులు నమోదుకాగా.. ప్రస్తుతం 9,86,598 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా బారిన పడి భారత్‌లో ఇప్పటివరకు 79,784 మంది మృత్యువాతపడ్డారు.