ముందుగా చెల్లిస్తేనే కరెంటు సరఫరా

Published: Monday September 14, 2020

మీరు మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతుంటారు. హఠాత్తుగా సర్వీసు నిలిచిపోతుంది. ఆరాతీస్తే.. ‘తగినంత బ్యాలెన్స్‌ లేదు’ అని సమాధానమొస్తుంది. సర్వీసును తిరిగి పొందాలంటే మీరు ప్రీపెయిడ్‌ చేసి మీ ఫోన్‌ను రీచార్జి చేయించుకోవాలి. ఇకముందు మీ ఇంటికి కరెంటు సరఫరా కావాలంటే, సరిగ్గా ఇలాగే ప్రీపెయిడ్‌ చేయాల్సిందే! à°Žà°‚à°¤ ముందుగా మీరు చెల్లిస్తే అంతే కరెంటు వాడుకొంటారు. ఈమేరకు కొత్తగా పెట్టే విద్యుత్‌ మీటర్లన్నీ ప్రీ పెయిడ్‌ మీటర్లు కాబోతున్నాయి. దీనిని à°’à°• నిబంధనగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇప్పటిదాకా విద్యుత్‌ వాడకం తర్వాత నెలకు ఒకసారి కరెంటు బిల్లును వినియోగదారులు చెల్లిస్తున్నారు. à°† రోజులు పోతున్నాయి. ప్రీ పెయిడ్‌ మీటర్లు వస్తే à°† చెల్లింపులు ముందుగానే చేయాల్సి ఉంటుంది. à°† మొత్తం అయిపోగానే కరెంటు సరఫరా ఆగిపోతుంది. అంటే, కరెంటు బిల్లు  వచ్చిన తర్వాత తీరిగ్గా వీలు చూసుకొని బిల్లు చెల్లించే పద్ధతికి కేంద్రం చెల్లు చీటి రాయబోతున్నదన్నమాట! చెల్లింపుల విధానాన్ని మెరుగుపర్చుకొని వినియోగదారుల నుంచి బకాయిలు లేకుండా చూసుకోవడానికి à°ˆ విధానం ప్రవేశపెడుతున్నారు.

 

  కేంద్ర విద్యుత్‌ శాఖ రెండు రోజుల కిందట అన్ని రాష్ట్రాలకు à°“ విధి విధానాల ముసాయిదాను పంపింది. వినియోగదారుల హక్కులకు సంబంధించిన విద్యుత్‌ విధి విధానాల ముసాయిదా- 2020 అని దీనికి పేరు పెట్టారు. à°ˆ నెలాఖరులోగా రాష్ట్ర ప్రభుత్వాలు, విద్యుత్‌ సంస్థలు తమ అభిప్రాయాలు తెలపాలని అందులో సూచించారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్‌ చట్టంలో భాగంగా à°ˆ విధి విధానాలను రూపొందించారు. ఒకసారి కేంద్రం వీటిని ఆమోదిస్తే దేశం అంతా ఇవి అమల్లోకి వస్తాయి. వాటిని పాటించి అమలు చేయడమే రాష్ట్ర ప్రభుత్వాల విధి అవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల్లోని పాత మీటర్లను వెంటనే ప్రీపెయిడ్‌లోని మార్చాలని ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. ఇకముందు..గృహ వినియోగదారులు, షాపులకు మార్చే మీటర్లు.. ప్రీ పెయిడే అయి ఉండాలని తన నిబంధనల్లో కేంద్రం స్పష్టంగానే సంకేతాలు ఇచ్చింది.