గంగా జలాలతో .. బీహెచ్‌యూ అధ్యయనం...

Published: Tuesday September 15, 2020

à°—à°‚à°—à°¾ జలాలు అత్యంత పవిత్రమైనవని చెప్తూ ఉంటారు. అనేక రకాల వ్యాధులను నయం చేయడానికి తగిన ఔషధ లక్షణాలు à°—à°‚à°—à°¾ జలాలకు ఉన్నట్లు పరిగణిస్తారు. à°ˆ విషయాన్ని ఇప్పుడు కోవిడ్-19 మహమ్మారికి ఔషధాన్ని కనుగొనడం కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) పరిగణనలోకి తీసుకుని, అధ్యయనాలు నిర్వహిస్తోంది. కోవిడ్-19 చికిత్సలో à°—à°‚à°—à°¾ జలాలు ముఖ్య పాత్ర పోషించగలవనే ఆలోచనతో à°ˆ అధ్యయనాలు జరుగుతున్నాయి. 

 

à°—à°‚à°—à°¾ జలాలకుగల ఔషధ సంబంధ ఉపయోగాలను రుజువు చేసేందుకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి చెందిన వైద్య శాస్త్రాల సంస్థ (ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) ప్రయత్నిస్తోంది. గాంజెటిక్ బ్యాక్టీరియోఫాగేస్‌ను సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ (కోవిడ్-19)కు చికిత్సలో ఉపయోగించేందుకు అధ్యయనాలు నిర్వహిస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రయోగాలను మానవులపై నిర్వహించబోతోంది. బీహెచ్‌యూ ఎథికల్ కమిటీ అనుమతి కోసం à°ˆ పరిశోధక బృందం ఎదురు చూస్తోంది. 

 

బ్యాక్టీరియోఫాగే అనేది à°“ రకమైన వైరస్. ఇది వేరొక బ్యాక్టీరియాకు సోకి, దానిలోని సెల్స్‌ను ధ్వంసం చేస్తుంది. అందుకే దీనిని బ్యాక్టీరియా ఈటర్ అంటారు. బ్యాక్టీరియోఫాగే వైరస్ వేరొక బ్యాక్టీరియాకు సోకి, దానిని తినేస్తుందన్నమాట. బ్యాక్టీరియల్ సెల్స్‌కు సోకి, వాటిని చంపే వైరస్‌లనే బ్యాక్టీరియోఫాగేస్ అంటారు. 

 

à°—à°‚à°—à°¾ జలాలపై పరిశోధన చేస్తున్న బృందంలో శాఖాధిపతి ప్రొఫెసర్ రామేశ్వర్ నాథ్ చౌరాసియా, సీనియర్ న్యూరాలజిస్ట్ ప్రొఫెసర్ విజయ్ నాథ్ మిశ్రా, కుమారి నిథి, డాక్టర్ అభిషేక్ పాఠక్, డాక్టర్ వరుణ్ కుమార్ సింగ్, డాక్టర్ ఆనంద్ కుమార్, లక్నోలోని సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్, సిస్టమ్ టాక్సికాలజీ అండ్ హెల్త్ రీసెర్చ్ గ్రూప్‌కు చెందిన రజనీష్ చతుర్వేది, అలహాబాద్ హైకోర్టు అమికస్ క్యూరీ అరుణ్ కుమార్ గుప్తా ఉన్నారు. 

 

వీరి సమీక్ష వ్యాసం ‘బ్యాక్టీరియోఫాగేస్‌ : సార్స్-కోవ్-2 ఇన్ఫెక్షన్ చికిత్సలో పోషించే అవకాశం à°—à°² పాత్ర’ను ప్రచురించేందుకు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ ఆమోదించింది. 

 

బ్యాక్టీరియోఫాగేస్‌కు యాంటీ బ్యాక్టీరియల్ ఎబిలిటీస్‌తోపాటు యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కూడా ఉన్నట్లు చాలా అధ్యయనాలు ధ్రువీకరించాయి. 

 

ప్రొఫెసర్ విజయ్ నాథ్ మిశ్రా మాట్లాడుతూ, సార్స్-కోవ్-2పై బ్యాక్టీరియోఫాగేస్‌ ప్రభావాన్ని à°ˆ సమీక్ష వెల్లడించిందన్నారు. ముఖ్యంగా ఫాగే థెరపీ గురించి తెలిసిందని చెప్పారు. వైరల్ పాథోజెన్స్‌కు వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తిని సమర్థంగా పెంచుకోవడం కోసం ఫాగే థెరపీ దోహదపడుతున్నట్లు వెల్లడైందన్నారు. యాంటీ వైరల్ ప్రొటీన్ ఫాగిసిన్‌ను ఫాగేస్ ఉత్పత్తి చేస్తాయన్నారు. 

 

à°—à°‚à°—à°¾ జలాలు అనేక వ్యాధులకు ఔషధ కారకంగా పని చేస్తాయని సంప్రదాయంగా పరిగణిస్తారని చెప్పారు. కోవిడ్-19 చికిత్సలో à°—à°‚à°—à°¾ నది ఔషధ పాత్రను పోషించవచ్చుననే ఆలోచన తమకు వచ్చిందని తెలిపారు. 

 

ఫాగిసిన్ అనేది à°“ ప్రొటీన్. ఇది వైరల్ డీఎన్ఏ నకలుతో సంబంధం ఏర్పరచుకుంటుంది. అయితే దాని డీఎన్ఏకు ఎటువంటి హాని కలిగించదు. శరీరంలోని ఫాగేస్ ఇతర అత్యధికంగా ఇన్ఫెక్ట్ అయిన యూకరియోటిక్ వైరస్‌లతో ఢీకొడతాయి. తద్వారా హోస్ట్ సెల్‌పై వాటి హానికర చర్యలు పరిమితమవుతాయి. బ్యాక్టీరియోఫాగేస్‌లో న్యూక్లియిక్ యాసిడ్ మాలెక్యూల్ ఉంటుంది. దీని చుట్టూ స్పెసిఫిక్ ప్రొటీన్ కోట్ ఉంటుంది. 

 

à°—à°‚à°—à°¾ నదిలో బ్యాక్టీరియా కన్నా మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియోఫాగేస్ ఉంటాయి. నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం, à°—à°‚à°—à°¾ నదిలో బ్యాక్టీరియోఫాగేస్ దాదాపు 1,100 రకాలు ఉన్నాయి. యమునా నది, నర్మద నదిలో సుమారు 200 రకాల బ్యాక్టీరియోఫాగేస్ మాత్రమే ఉన్నాయి. 

 

à°—à°‚à°—à°¾ జలాలు హై ఆల్కలైనిటీ (క్షారత్వం-నీటిలో ఆమ్లత్వ లక్షణాలను నిరోధించే సామర్థ్యం)ను ప్రదర్శిస్తున్నాయి. అదేవిధంగా à°—à°‚à°—à°¾ జలాల్లోని స్వీయ ప్రక్షాళన లక్షణాలు బ్యాక్టీరియోఫాగేస్ వృద్ధి చెందడానికి దోహదపడుతున్నాయి. 

 

ప్రొఫెసర్ చౌరాసియా మాట్లాడుతూ, రోగ నిరోధక వ్యవస్థను క్రమబద్ధీకరించడం, రోగ నిరోధక వ్యవస్థను క్రియాశీలం లేదా అచేతనం చేయడం మధ్య ఫాగేస్ మధ్యవర్తిత్వం వహిస్తాయన్నారు. ఫాగేస్, వాటికిగల యాంటీ వైరల్ లక్షణాల గురించి ప్రాథమిక విషయాలు తెలిశాయని, వీటిని సజీవంగా ఉన్న జీవుల్లోనూ, టెస్ట్ ట్యూబ్ వంటి జీవం లేని వ్యవస్థల్లోనూ అత్యంత జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత నిర్థరించవలసి ఉంటుందని చెప్పారు. ప్రయోగశాలల్లో అధ్యయనాలు భరోసానిచ్చే ఫలితాలను వెల్లడించినట్లయితే, క్లినికల్ స్టడీస్, ర్యాండమైజ్డ్ ఫేజ్ 1-3 ట్రయల్స్ నిర్వహించడానికి అవకాశం ఉంటుందన్నారు. బీహెచ్‌యూ ఎథికల్ కమిటీ అనుమతి ఇచ్చిన వెంటనే హ్యూమన్ ట్రయల్స్ ప్రారంభమవుతాయన్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.