చైనా, పాకిస్థాన్ దుర్బుద్ధిని ఎండగట్టిన రాజ్‌నాథ్

Published: Tuesday September 15, 2020

 à°šà±ˆà°¨à°¾, పాకిస్థాన్ దుష్ట చర్యలను, దుర్బుద్ధిని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటు సాక్షిగా ఎండగట్టారు. మన పొరుగున ఉన్న à°ˆ రెండు దేశాలు పాల్పడుతున్న అక్రమాలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. లడఖ్‌లోని 38 వేల చదరపు కిలోమీటర్ల భూమి చైనా అనధికారిక ఆక్రమణలో ఉందని కుండబద్దలు కొట్టారు. చైనా చర్యలు భారత్-చైనా మధ్య కుదిరిన వివిధ ద్వైపాక్షిక ఒప్పందాల పట్ల నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయని దుయ్యబట్టారు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని భారత భూభాగాన్ని చట్టవిరుద్ధంగా చైనాకు పాకిస్థాన్ అప్పగించిందన్నారు. 

 

రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం లోక్‌సభలో మాట్లాడుతూ, ద్వైపాక్షిక ఒప్పందాలను చైనా నిర్లక్ష్యం చేస్తోందని చెప్పారు. లడఖ్‌లోని దాదాపు 38 వేల చదరపు కిలోమీటర్ల భూభాగం చైనా అనధికారిక ఆక్రమణలో ఉందన్నారు. 1963లో జరిగిన సరిహద్దు ఒప్పందంగా చెప్పుకుంటున్నదాని ప్రకారం పాకిస్థాన్ చట్టవిరుద్ధంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని 5,180 చదరపు కిలోమీటర్ల భారత దేశ భూమిని చైనాకు అప్పగించిందన్నారు. 

 

చైనా చర్యలు భారత్-చైనా మధ్య కుదిరిన అనేక ద్వైపాక్షిక ఒప్పందాల పట్ల చైనా నిర్లక్ష్యాన్ని తెలియజేస్తున్నాయన్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనా పెద్ద ఎత్తున దళాలను మోహరించడం 1993, 1996లలో ఆమోదించిన ఒప్పందాలను ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు. 

 

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)ని గౌరవించడం, దానికి కచ్చితంగా కట్టుబడి ఉండటమే సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంతత, సామరస్యాలకు ప్రాతిపదిక అని తెలిపారు. దీనిని మన సాయుధ దళాలు కచ్చితంగా పాటిస్తున్నాయని, అయినప్పటికీ, చైనా వైపు నుంచి ఇటువంటిది జరగడం లేదని చెప్పారు. 

 

ఇప్పటి వరకు చైనా భారీ సంఖ్యలో దళాలను ఎల్ఏసీ వద్ద మోహరించిందని, ఆయుధాలను తీసుకొచ్చిందని చెప్పారు. తూర్పు లడఖ్, గోగ్రా, కొంగ్‌à°•à°¾ లా, పాంగాంగ్ సరస్సు వద్ద అనేక ఘర్షణ ప్రాంతాలు ఉన్నట్లు తెలిపారు. సరిహద్దుల్లో సమస్యలను శాంతియుత చర్చలు, సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు భారత దేశం కట్టుబడి ఉందన్నారు. à°ˆ లక్ష్యాన్ని సాధించడం కోసం తాను చైనా రక్షణ మంత్రితో à°ˆ నెల 4à°¨ మాస్కోలో చర్చలు జరిపానని చెప్పారు. చర్చలు చాలా లోతుగా జరిగాయన్నారు. భారత దేశ ఆందోళనలను చైనాకు వివరించినట్లు తెలిపారు. భారీ సంఖ్యలో దళాలను మోహరించడం, దురాక్రమణ బుద్ధితో ప్రవర్తించడం, యథాతథ స్థితిని మార్చేందుకు ఏకపక్షంగా ప్రయత్నించడం ఆందోళనకరమని చెప్పినట్లు తెలిపారు. 

 

à°ˆ సవాలును మన సాయుధ దళాలు విజయవంతంగా ఎదుర్కొంటాయని సభ విశ్వసిస్తోందన్నారు. ఇందుకు మన సైన్యం మనకు గర్వకారణమని చెప్పారు. ప్రస్తుత సమస్య సున్నితమైన కార్యాచరణ అంశాలకు సంబంధించినదని చెప్పారు. దీని గురించి మరిన్ని వివరాలను వెల్లడించబోనని చెప్పారు. చైనా చర్యలకు ప్రతిస్పందిస్తూ మన సాయుధ దళాలు కూడా తగిన విధంగా దళాలను మోహరించినట్లు తెలిపారు. భారత దేశ రక్షణ. భద్రతా ప్రయోజనాలను కాపాడేవిధంగా à°ˆ ప్రాంతంలో దళాలను మోహరించినట్లు తెలిపారు. 

 

ఓవైపు చర్చలు జరుగుతుండగానే మరోవైపు ఆగస్టు 29-30 మధ్య రాత్రి ఏకపక్షంగా యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించిందని, ఈ ప్రయత్నాలను భారతీయ దళాలు విజయవంతంగా తిప్పికొట్టాయని తెలిపారు. పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలో జరిగిన ఈ ప్రయత్నాలను భారతీయ దళాలు దీటుగా తిప్పికొట్టినట్లు చెప్పారు.