బాబ్రీ కూల్చివేత కేసు తీర్పు 30న..

Published: Wednesday September 16, 2020

దశాబ్దాలుగా నడుస్తున్న బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై సెప్టెంబర్ 30à°¨ ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి ఎస్‌కే యాదవ్ తీర్పును ప్రకటించనున్నారు. తీర్పును వినేందుకు à°ˆ కేసులోని నిందితులందరూ తప్పనిసరిగా కోర్టుకు హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు. à°ˆ కేసులో బీజేపీ వెటరన్ నేతలు ఎల్.కే.అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి సహా 32 మంది నిందితులుగా ఉన్నారు.

 

 

జస్టిస్ రోహిన్టన్ ఫాలి నారిమన్ సారథ్యంలోని సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 19న జారీ చేసిన ఆదేశంలో.. బాబ్రీ కేసులో తీర్పును సెప్టెంబర్ 30 వరకూ వాయిదా వేస్తున్నట్టు పేర్కొంది. బాబ్రీ స్థలంలో పురాతన రామాలయం ఉదంటూ 'కరసేవకులు' 1992 డిసెంబర్ 6న అయోధ్యలోని బాబ్రీ మసీదును కూల్చివేశారు. ఆ సమయంలో రామాలయ ఉద్యమానికి సారథ్యం వహించిన వారిలో ఎల్.కె.అడ్వాణీ, ఎం.ఎం.జోషిలు ఉన్నారు. అడ్వాణీ, జోషిలు వీడియా కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు తమ వాంగ్మూల్మం ఇచ్చారు.

 

 

కాగా, వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని రామాలయ నిర్మాణం కోసం ట్రస్టుకు అప్పగించాలని గత ఏడాది సుప్రీంకోర్టుకు చెందిన ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పునిచ్చింది. అయోధ్యలోనే మరో చోట ఐదెకరాల స్థలాన్ని మసీదు నిర్మాణానికి ఇవ్వాలని కూడా ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.