ట్రంప్ నిర్ణయం వల్లే.. వైరస్ వేగం

Published: Sunday September 20, 2020

 à°®à±ˆà°•à±à°°à±‹à°¸à°¾à°«à±à°Ÿà± సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ రెండవ ధనవంతుడు బిల్‌గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడానికి డొనాల్డ్ ట్రంపే కారణం అన్నారు. ఆయన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లే.. అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందన్నారు. వివరాల్లోకి వెళితే.. బిల్‌గేట్స్ తాజాగా à°“ మీడియా సంస్థకు ఇంటర్యూ ఇచ్చారు. à°ˆ సందర్భంగా మాట్లాడిన ఆయన.. కరోనాను కట్టడి చేసే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్.. ప్రయాణాలపై ఆంక్షలు విధించిందన్నారు. అయితే à°† నిర్ణయమే కొంప ముంచిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రయాణాలపై ఆంక్షలు విధించడం వల్ల.. ఇతర దేశాల్లో ఉన్న అమెరికన్లు పెద్ద సంఖ్యలో అమెరికాకు చేరుకున్నట్లు చెప్పారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా టెస్టులు చేయలేదన్నారు. వారిని కనీసం క్వారెంటైన్ కేంద్రాలకు కూడా తరలించలేదన్నారు. కొవిడ్ టెస్ట్ కిట్లు, క్వారెంటైన్ కేంద్రాలు పరిమిత సంఖ్యలో ఉండటం దీనికి కారణం అన్నారు. దీంతో అమెరికా అంతటా వైరస్ వేగంగా వ్యాప్తి చెందిందని వివరించారు. కాగా.. అమెరికాలో ఇప్పటి వరకు దాదాపు 70లక్షల మంది కరోనా బారినపడగా.. మరణాల సంఖ్య 2లక్షలకు చేరువలో ఉంది.