అమిత్ షాతో వైఎస్ జగన్ భేటీ..

Published: Tuesday September 22, 2020

 à°•à±‡à°‚ద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న జగన్ కొద్దిసేపటి క్రితమే షాను కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు. à°ˆ సందర్భంగా కరోనా నుంచి కోలుకున్న à°·à°¾ ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో పరిస్థితులపై హోం మంత్రికి నిశితంగా సీఎం వివరించారు.

 

 

ముఖ్యంగా.. à°à°ªà±€à°•à°¿ ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానాలు, పెండింగ్ నిధుల విడుదలతో పాటు పలు విషయాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. మరీ ముఖ్యంగా.. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై à°¸à±€à°¬à±€à° దర్యాప్తు అంశాలను కూడా సీఎం జగన్.. à°·à°¾ దృష్టికి తీసుకెళ్లారు. అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని, పెండింగ్ అంశాలపై అమిత్ షాకు విజ్ఞాపన పత్రాన్ని జగన్ అందజేశారు. జగన్‌ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు.

 

కాగా.. షాతో భేటీ అనంతరం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లు తెలియవచ్చింది. ఇవాళ రాత్రి జగన్ అక్కడే బస చేసి బుధవారం ఉదయం జగన్ ఏపీకి తిరుగుపయనం కానున్నారు.