శ్రీవారి సేవలో ఏపీ, కర్ణాటక సీఎంలు

Published: Friday September 25, 2020

 à°à°ªà±€, కర్ణాటక ముఖ్యమంత్రులు జగన్మోహన్‌రెడ్డి, యడియూరప్ప గురువారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ముందుగా సంప్రదాయ వస్త్రధారణతో మహాద్వారం వద్దకు చేరుకున్న జగన్‌కు ఆలయ అధికారులు స్వాగతం పలకగా, అర్చకులు తిరునామం దిద్దారు. à°† తర్వాత వెండివాకిలి వరకు వెళ్లిన జగన్‌.. కర్ణాటక సీఎం యడియూరప్ప వెనుకనే వస్తున్నారనే సమాచారంతో  తిరిగి మహాద్వారం వద్దకు చేరుకుని ఆయనకు స్వాగతంపలికి ఆలయంలోకి తీసుకెళ్లారు. 

 
 

ధ్వజస్తంభాన్ని తాకుతూ గర్భాలయానికి చేరుకుని శ్రీవారి మూలవిరాట్టును దర్శించుకున్నారు. తిరిగి ధ్వజస్తంభం వద్దనున్న బలిపీఠానికి మొక్కుకుని, రంగనాయక మండపానికి చేరుకున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. కాగా, ఇద్దరు సీఎంలు ఒకరికొకరు పట్టువస్ర్తాన్ని కప్పుకుని, తీర్థప్రసాదాలు అందించుకొన్నారు. దర్శనం తర్వాత ఆలయం ముందున్న నాదనీరాజనం వేదికపై 50 నిమిషాలు కూర్చుని అన్నమయ్య సంకీర్తనలను ఆలకించారు. కర్ణాటక సత్రాల ప్రాంతంలో నిర్మించనున్న వసతి సముదాయాలకు ఇద్దరూ భూమిపూజ చేశారు.