పాక్ ను పురమాయించిన చైనా

Published: Saturday September 26, 2020

భారత్‌తో నేరుగా తలపడలేక.... చైనా పాకిస్తాన్ ను పురమాయించింది. నయ వంచనతో, అన్ని విలువలనూ తుంగలో తొక్కి... భారత్ ను ఎన్ని ఇబ్బందులు పెట్టినా... భారత సైన్యం చైనా బలగాలపై, కుతంత్రాలపై విజయం సాధిస్తూ వస్తోంది. యుద్ధ తంత్రానికి వ్యతిరేకంగా వెన్నుపోటు పొడవాలని చైనా ప్రయత్నించినా... భారత సైన్యం à°† ప్రయత్నాన్ని తిప్పి కొట్టింది. ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తగులుతుండటంతో చైనా బిత్తరపోతోంది.

 

ఏమి చేయాలో తోచక... నేరుగా భారత్ తో తలపడలేక... దాయాది పాకిస్తాన్ ను పురమాయిస్తున్న విషయాన్ని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. లద్దాఖ్ ప్రాంతంలో భారత్ కు వ్యతిరేకంగా కార్యకలాపాలను పెంచడానికి, అశాంతిని రేకెత్తించడానికి పాకిస్తాన్ తో కలిసి పన్నాగం పన్నాలని డ్రాగన్ నిర్ణయించుకుందని ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

 

జమ్మూ కశ్మీర్ లో భారీ సంఖ్యలో ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని, పేలుడు పదార్థాలను నెట్టేయాలని చైనా పాకిస్తాన్ ను ఆదేశించింది. ఇందుకోసం à°“ ప్రణాళికను కూడా రూపొందించాలని పురామాయించిందని భారత ఇంటెలిజెన్స్ పేర్కొంటోంది. దీనికి గాను పాక్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్‌ఐకి చైనా ఆదేశాలిచ్చినట్లు సమాచారం. à°† ఆయుధాలపై చైనాకు సంబంధించిన గుర్తులు కూడా ఉన్నాయని భారత అధికారులు పేర్కొంటున్నారు.

 

భద్రతా బలగాలు ఏర్పాటు చేసిన ‘చొరబాటు నిరోధక గ్రిడ్’ కారణంగా కశ్మీర్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు, ఆయుధాల నెట్టివేతకు చెందిన కుట్రలు తగ్గుముఖం పట్టాయని, చైనా పాకిస్తాన్ కు అప్పజెప్పిన పని à°…à°‚à°¤ సులభమేమీ కాదని అధికారులు ప్రకటించారు. ఇలా ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ‘చొరబాటు నిరోధక గ్రిడ్’ ను మరింత బలోపేతం చేశారు