రాష్ట్రంలో 6.61 లక్షల కేసులు

Published: Saturday September 26, 2020

కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. à°—à°¤ 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,073 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458à°•à°¿ పెరిగింది. మరోవైపు 8,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రికవరీలు 5.88 లక్షలకు పెరిగాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 48మంది చనిపోయారు. చిత్తూరులో 8, ప్రకాశంలో 8, అనంతపురంలో 6, కృష్ణాలో 5, పశ్చిమ గోదావరిలో 5, కడపలో 3, నెల్లూరులో 3, విశాఖపట్నంలో 3, తూర్పు గోదావరిలో 2, గుంటూరులో 2, కర్నూలులో 2, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో మరణాలు 5,606à°•à°¿ పెరిగాయి. తూర్పుగోదావరి జిల్లాలో కరోనా జోరుకి అడ్డుకట్ట పడడం లేదు.

 

రోజూ ఇక్కడ వెయ్యికిపైనే కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం కూడా 1,031మందికి వైరస్‌  సోకింది. దీంతో జిల్లాలో మొత్తం బాధితుల సంఖ్య 92,173à°•à°¿ పెరిగింది. కరోనాతో 503మంది ప్రాణాలు విడిచారు. పశ్చిమగోదావరి జిల్లాలో 867 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో బాధితుల సంఖ్య 68,009à°•à°¿ చేరింది. గుంటూరు జిల్లాలో కొత్తగా 533 మంది కొవిడ్‌ బారినపడ్డారు. మొత్తం కేసుల సంఖ్య 53,935à°•à°¿ పెరిగింది. కృష్ణాజిల్లాలో కొత్తగా 423మందికి కరోనా సోకింది. మొత్తం కేసులు 25,704à°•à°¿, మరణాలు 418à°•à°¿ పెరిగాయి. అనంతపురం జిల్లాలో 456 కేసులు బయటపడ్డాయి. దీంతో బాధితుల సంఖ్య 55216à°•à°¿ పెరిగింది. కరోనా మరణాల సంఖ్య 472à°•à°¿ చేరుకుంది. శ్రీకాకుళం జిల్లాలో మరో 430 కేసులు బయటపడ్డాయి. బాధితుల సంఖ్య 38,079à°•à°¿ చేరుకుంది. కర్నూలు జిల్లాలో మరో 205 కేసులు వచ్చాయి. కేసుల సంఖ్య 55,250à°•à°¿, మరణాల సంఖ్య 458à°•à°¿ చేరింది. విజయనగరం జిల్లాలో శుక్రవారం 378 కేసులు నమోదవగా బాధితుల సంఖ్య 33,454à°•à°¿ చేరింది. తాజాగా విశాఖలో 340, కడపలో 368, నెల్లూరులో 459 కేసులు బయటపడ్డాయి.