వాయువ్య భారతం మినహా దేశమంతా అధిక వర్షపాతం

Published: Sunday September 27, 2020

(విశాఖపట్నం - ఆంధ్రజ్యోతి)

కోస్తా, సీమ తేడా లేకుండా... ఎటు చూసినా కుండపోత! ఎన్నడూ లేనంత స్థాయిలో పొంగి పొర్లుతున్న వాగులూ వంకలూ! కృష్ణా, గోదావరి జలాల నుంచి వేల టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఇంకా కలుస్తూనే ఉన్నాయి! దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. భారీ తుఫాన్లు లేకున్నా... ఈసారి ఎందుకింత వర్షం!? à°ˆ ప్రశ్నలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాతావరణ విభాగం విశ్రాంత ఆచార్యుడు ఓఎ్‌సఆర్‌యూ భానుకుమార్‌ చెబుతున్న సమాధానమిది! వివరాలు ఆయన మాటల్లోనే... à°ˆ నైరుతి రుతుపవనాల సీజన్‌ ముగియడానికి మరో నాలుగు రోజులు సమయం ఉంది. కానీ, ఇప్పటికే అసాధారణ వర్షాలు కురిశాయి. భారత వాతావరణ శాఖ అంచనాలకు మించి à°ˆ ఏడాది వర్షాలు కురిశాయి. దేశంలో 864.9 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... శనివారం వరకు 945.7 మి.మీ.లు కురిసింది. అంటే, సాధారణం కంటే తొమ్మిది శాతం అధికం. వాయువ్య భారతంలో మాత్రమే తక్కువ వర్షపాతం నమోదైంది.  దక్షిణ భారతంలో 30, మధ్యభారతంలో 16, ఈశాన్య/తూర్పుభారతంలో సాధారణం కంటే ఏడు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. 

 

ఏమిటి కారణం..

మూడు ప్రధాన సముద్రాలు చల్లబడడంతో ఉపరితలం నుంచి వచ్చే చల్లని గాలులతో నైరుతి రుతుపవనాల సీజన్‌లో విస్తారంగా వర్షాలు కురిశాయి. పసిఫిక్‌ మహాసముద్రంలో చల్లని తటస్థ పరిస్థితులు (కూల్‌ ఎన్సూ నూట్రల్‌ కండిషన్స్‌)  కొనసాగుతున్నాయి. అట్లాంటిక్‌ మహాసముద్రంలో చల్లని వాతావరణం (అట్లాంటిక్‌ నినో), హిందూ మహాసముద్రంలో అనుకూల ఇండియన్‌ డైపోల్‌ మోడ్‌ (పాజిటివ్‌ ఐవోడీ) ఉన్నాయి. à°ˆ మూడు సముద్రాల ఉపరితల ఉష్ణోగ్రతలు ఒకేసారి అనుకూలంగా ఉండడం అసాధారణం. à°ˆ మూడింటి ప్రభావంతో నైరుతి రుతుపవనాల సీజన్‌లో జూలైలో కొద్దిపాటి లోటు తప్ప మిగిలిన మూడు నెలలు మంచి వర్షాలు కురిశాయి. ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో అయితే అనుకున్న దానికి మించి భారీ నుంచి అతిభారీగా, అనేకచోట్ల కుంభవృష్టిగా వర్షాలు కురిశాయి.