కరోనా రెండో దశ

Published: Friday October 09, 2020

రాష్ట్రంలో కరోనా సెకండ్‌ వేవ్‌(రెండోదశ) ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎ్‌à°¸.జవహర్‌రెడ్డి అన్నారు. పాఠశాలలు, సినిమా థియేటర్లు తెరిచిన తర్వాత à°ˆ దశ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండో విడతలో కేసులు నమోదైనా మొదటి దశలో ఉన్నంత తీవ్రత ఉండదని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 50శాతం వరకూ హెర్డ్‌ ఇమ్యూనిటీ వచ్చిందన్నారు. దీనివల్ల సెకండ్‌ వేవ్‌లో కేసుల సంఖ్య చాలా తక్కువ నమోదవుతాయని తెలిపారు. ప్రస్తుతం కరోనా నుంచి ఏపీ చాలా సురక్షితంగా ఉందని, à°ˆ నెలాఖరు నాటికి కేసుల సంఖ్య తగ్గుతుందని వివరించారు. పాఠశాలలు ప్రారంభించిన తర్వాత టీచర్లు, సిబ్బంది, విద్యార్థులు అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మాస్క్‌, శానిటైజర్‌, భౌతిక దూరం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం కచ్చితంగా పాటించాలన్నారు.

 

వ్యాయామం చేయడం, వేడి పదార్థాలు తీసుకోవడం, ఆవిరిపట్టడం, పసుపు కలిపిన పాలు తాగడం వంటివి పాటిస్తే కరోనా బారి నుంచి, తదనంతర సమస్యల నుంచి బయటపడొచ్చని సూచించారు. పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు ప్రత్యేక నిబంధనలు సిద్ధం చేస్తున్నామన్నారు. అవసరమైతే రోజుకు à°’à°•à°Ÿà°¿ చొప్పున తరగతులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో వైరస్‌ వ్యాప్తి నివారణను జీరో నుంచి ప్రారంభించామని, ఇదో మంచి అనుభవంగా పేర్కొన్నారు. 17శాతంగా ఉండే పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 7శాతానికి తగ్గాయని, వీటిని 5శాతం కంటే తగ్గించి, మరణాలు కూడా తగ్గితే వైరస్‌ అదుపులోకి వస్తుందన్నారు. కరోనా సమయంలో ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, వైద్యులు, క్షేత్ర స్థాయి సిబ్బంది అద్భుతంగా పనిచేశారని కితాబు ఇచ్చారు.కాగా, టీటీడీ ఈవోగా బదిలీ అయిన ఆయనకు à°† శాఖ అధికారులు విజయవాడలోని ఆర్‌అండ్‌బీ బిల్డింగ్‌లో ఆత్మీయ వీడ్కోలు సభ నిర్వహించారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణలో భగవంతుడు తనకు పెద్ద పరీక్షే పెట్టాడన్నారు. వైరస్‌ నియంత్రణలో జాతీయ స్థాయిలో రాష్ట్రానికి మంచిపేరు రావడం ఆనందంగా ఉందన్నారు. వచ్చే ఏడాది వరకూ కరోనా ప్రభావం కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు.