అప్పన్న సన్నిధిలో అరటన్ను ఇత్తడి సామగ్రి చోరీ

Published: Monday October 12, 2020

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో హిందూ దేవాలయాల పరిరక్షణపై నీలినీడలు కమ్ముకున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. అంతర్వేది లక్ష్మీ నరసింహుని ఆలయంలో రథం దహనం ఘటన పెను దుమారమే రేపింది. à°† తర్వాత బెజవాడ దుర్గ వెండి రథం సింహపు బొమ్మలు చోరీకి గురైన సంఘటన మరో సంచలనమైంది. ఇప్పుడు.. సింహాచలం దేవస్థానం వంతు వచ్చింది. సింహాద్రి అప్పన్న స్వామికి భక్తులు సమర్పించిన కానుకలకు భద్రత కరువైంది. భక్తులు వివిధ రూపాల్లో మొక్కుబడులుగా అందజేసిన ఇత్తడి సామగ్రిలో సుమారు 550 కిలోల మేర అపహరణకు గురైనట్లు ఆలయ అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఆదివారం ఉదయం హుటాహుటిన వచ్చి ప్రాథమిక విచారణ జరిపారు.

 

ఇది ఇంటి దొంగల పనేనని అంచనాకు వచ్చారు. ఆలయ వర్గా కథనం ప్రకారం.. సింహాచలం వరాహ లక్ష్మీనృసింహ స్వామికి రైతులు, ఇతర వర్గాల భక్తులు మొక్కుబడులుగా వివిధ రూపాల్లో ఇత్తడి సామగ్రిని కానుకలుగా సమర్పించడం అనాదిగా వస్తోంది. వీటిల్లో చాలా వరకు బహిరంగంగా వేలం వేస్తుంటారు. అలా సమకూరిన 665 కిలోల ఇత్తడి సామాన్లకు నాలుగు నెలల కిందట బహిరంగ వేలం నిర్వహించగా à°“ కాంట్రాక్టర్‌ వాటిని దక్కించుకున్నారు. కొంత సొమ్ము చెల్లించి, వాటిని 41 మూటలుగా కట్టి దేవాలయ కల్యాణ మండపంలో భద్రపరచి, మిగిలిన సొమ్ము చెల్లించాక తీసుకుని వెళ్లాలనుకున్నారు.

 

à°ˆ నేపథ్యంలో శనివారం దేవస్థానం అధికారులు పరిశీలించగా, 41 మూటలకుగాను ఏడు మాత్రమే కనిపించడంతో నిర్ఘాంతపోయారు. మిగిలిన 34 మూటలు (సుమారు 550 కిలోలు) అపహరణకు గురైనట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న దేవదాయ శాఖ జాయింట్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ ఆజాద్‌ ఉదయం ప్రాథమిక విచారణ జరిపారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ ఇత్తడి సామగ్రి మాయమైందంటే కచ్చితంగా ఇంటిదొంగల పనేనని అభిప్రాయపడ్డారు. à°ˆ ఘటనపై ఆలయ ఏఈవో పులి రామారావు గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇత్తడి సామగ్రి భద్రపరిచిన కల్యాణ మండపంలో నాలుగు సీసీ కెమెరాలు ఉండగా, రెండు కెమెరాలు పనిచేయడంలేదని పోలీసుల పరిశీలనలో వెల్లడైనట్లు సమాచారం.