శిశువుల్లో కొవిడ్‌కు కారణాలివే

Published: Thursday October 15, 2020

నవజాత శిశువులు కరోనా బారిన ఎందుకు పడుతున్నారన్న దానిపై నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. దాదాపు 30 శాతం మంది నవజాత శిశువులు గర్భంలో ఉండగానో, లేదంటే ప్రసవ సమయంలోనో à°ˆ మహమ్మారి బారినపడుతున్నట్టు ఫ్రాన్స్‌లో నిర్వహించిన అధ్యయంలో వెలుగుచూసింది.

 

నవజాత శిశువులకు సంబంధించి 176 పబ్లిష్డ్ కేసులను సమీక్షించిన అనంతరం పరిశోధకులు à°ˆ విషయాన్ని తేల్చారు. నవజాత శిశువులు చాలా వరకు ప్రసవం తర్వాత వైరస్ బారినపడుతున్నారని, తల్లి ద్వారా గర్భంలోని శిశువుకు వైరస్ సోకడం చాలా అరుదని వివరించారు.  

 

సమీక్షించిన చాలా వరకు కేసుల్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, ముగ్గురు శిశువులు మాత్రం సంబంధం లేని కారణాలతో చనిపోయినట్టు నివేదిక పేర్కొంది. నవజాత శిశువుల్లో కొవిడ్ చాలా అరుదని, అయితే వారికి సోకదని మాత్రం చెప్పలేమని వివరించింది. శిశువులు జన్మించిన తర్వాత à°ˆ సంభావ్య ముప్పును ఎదుర్కొంటున్నారా? అన్న విషయాన్ని పరీక్షలు మాత్రమే వెల్లడించగలవని వైద్యులు చెబుతున్నారు. 

 

 à°…ధ్యయనంలో భాగంగా సమీక్షించిన కేసుల్లో దాదాపు 70 శాతం మంది శిశువులకు ఆసుపత్రిలో తల్లి ద్వారా కానీ, మెడికల్ సిబ్బంది, ఇతర రోగులు, బంధువులు, విజటర్ల ద్వారా కానీ వైరస్ సంక్రమించి ఉంటుందని అధ్యయనం తేల్చింది. మిగతా 30 శాతం మంది శిశువులకు ప్రసవానికి ముందు కానీ, à°† తర్వాత కానీ తల్లి నుంచి సంక్రమించి ఉంటుందని నిర్ధారించారు.