టీడీపీని అధికారంలోకి తెస్తాం

Published: Tuesday October 20, 2020

తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా.. వైసీపీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలపై గజ్జె కట్టి పోరాడతానని మాజీ మంత్రి, టీడీఎల్పీ ఉపనేత కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటించారు. తన నియామకాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అధికారికంగా ప్రకటించిన తర్వాత సోమవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విలేకరులతో మాట్లాడారు.   à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో బలహీన వర్గాలకు పర్యాయపదం తెలుగుదేశం పార్టీయేనని, 1982లో టీడీపీ ఆవిర్భావంతోనే బీసీ వర్గాలకు బలమైన రాజకీయ వేదిక రూపుదిద్దుకుందని.. పార్టీ గెలిచినా, ఓడినా à°ˆ వర్గాలు వెన్నంటి ఉండి ఆదరిస్తున్నాయని పేర్కొన్నారు. అందుకే ఇప్పుడు జరిపిన నియామకాల్లో 60 శాతం పదవులు బడుగు బలహీన వర్గాల వారికి లభించాయని, పార్లమెంటరీ కమిటీల అధ్యక్ష పదవుల్లో కూడా అధిక భాగం వారికే ఇచ్చారని గుర్తుచేశారు. ‘à°ˆ 17 నెలల పాలనలో వైసీపీ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించింది. ఎక్కడ చూసినా అవినీతి, కక్ష సాధింపులు, వేధింపులు నిత్యకృత్యంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌ పరువు తీశారు’ అని చెప్పారు.

 

తనపైనా.. తమ కుటుంబం పైనా.. బలహీన వర్గాల నాయకత్వంపైనా విశ్వాసంతో  చంద్రబాబు తనకీ అవకాశం ఇచ్చారని, ఆయనకు... పార్టీ కుటుంబ పెద్దలకు, పార్టీ కార్యకర్తలకు శిరసు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. తనపై చంద్రబాబు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, మనసా వాచా కర్మణా చిత్తశుద్ధితో పనిచేసి వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తెస్తామన్నారు. పార్టీ కేడర్‌ను మరింత క్రియాశీలం చేయడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తానని, మొదటి సమావేశం మంగళవారమే నిర్వహిస్తానని తెలిపారు. ‘బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై గళమెత్తుతాం. అధికార పార్టీలోని బీసీ నేతలు మాట్లాడలేరు. అధికారం వారి నోరు మూయించి వేస్తోంది. మాకు à°† బంధనాలు లేవు’ అని పేర్కొన్నారు. ‘టీడీపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. దశాబ్దాలుగా ప్రజాసేవలో అంకితమైన పార్టీ. ఎంతోమంది నాయకులకు జాతికి అందించింది. తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో మహానేత ఎన్టీఆర్‌ పార్టీని స్థాపించారు. అటువంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడిని కావడం ఆనందంగా ఉంది. నాపై బాధ్యత పెట్టిన పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్‌బాబులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

 

వైసీపీ ప్రభుత్వం పాలనను గాలికొదిలేసింది. కేవలం కక్షసాధింపు రాజకీయాలపై దృష్టిపెట్టింది. అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన అభివృద్ధి, సుపరిపాలనను గుర్తుచేసుకుంటున్నారు. ఇదే మా పార్టీకి శ్రీరామరక్ష. ప్రజలు టీడీపీకి బ్రహ్మరథం పట్టే రోజులు దగ్గర్లో ఉన్నాయి. రోజూ ఏదో చోట దళితులపై దాడులు జరుగుతునే ఉన్నాయి. సీఎం నోట నిత్యం కుల ప్రస్తావన వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కీలక పదవులు, నియామకాల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారు. నిధుల్లేని కార్పొరేషన్‌ పదవులు బీసీలకు కేటాయించారు. శాంతిభద్రతలు క్షీణించాయి. వైసీపీ స్కీములన్నీ గారడీ పథకాలే. ముఖ్యమంత్రి చేష్టలు ఈతకాయ ఇచ్చి తాటికాయ తీసుకునే చందంగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. మద్యం ధరలు పెంచారు. ఇసుకను వైసీపీ శ్రేణులకు ఆదాయ మార్గంగా మార్చారు. రాష్ట్ర భవిష్యత్‌ను తాకట్టుపెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. న్యాయవ్యవస్థపై దాడి వైసీపీ అరాచకానికి పరాకాష్ఠ. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయడం దారుణం’ అని తెలిపారు.