ఇకనుంచి ఒక్కో కార్డుదారు రెండు సార్లు వేలిముద్రలు

Published: Tuesday October 20, 2020

కరోనా వ్యాప్తితో  రేషన్‌ పంపిణీలో వేలిముద్ర వేసే విధానాన్ని తాత్కాలికంగా తీసేయాలని ప్రజలు ఒకవైపు గగ్గోలు పెడుతుంటే.. ఇకనుంచి ఒక్కో కార్డుదారు రెండు సార్లు వేలిముద్ర వేయాలని ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న రేషన్‌ పంపిణీ నుంచే దీనిని అమల్లోకి తెస్తున్నారు. ఇప్పటి వరకు ఈపోస్‌ యంత్రాలను 6.6 వెర్షన్‌ నుంచి 6.7 వెర్షన్‌కు అప్‌డేట్‌ చేశారు. దాంతోపాటే à°ˆ నూతన వేలిముద్రల విధానం అమల్లోకి వచ్చింది.

 

ప్రస్తుత విధానంలో à°’à°• కార్డుదారు ఒకసారి వేలిముద్ర వేస్తే బియ్యంతో పాటు ఇతర సరుకులు ఇస్తున్నారు. అయితే, మంగళవారం నుంచి బియ్యానికి ఒకసారి, ఇతర సరుకులకు మరోసారి వేలిముద్ర వేయాలని పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. కరోనా సమయంలో ఇలాంటి ప్రయోగాలు చేయాలా? అని ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. పౌరసరఫరాల శాఖ డీలర్లకు సరిపడ శానిటైజర్లు సరఫరా చేయడం లేదు. దీంతో డీలర్లు కూడా శానిటైజేన్‌ సౌకర్యం లేకుండానే లబ్ధిదారులకు సరుకులను పంపిణీ చేస్తున్నారు. ఒకే ఈపోస్‌ యంత్రంపై వందలాది మంది వేలిముద్రలు వేస్తున్నారు.

 

దీంతో ప్రజలు కరోనా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేషన్‌ తీసుకోవాలంటే.. వేలిముద్ర తప్పనిసరి. కానీ రెండో వేలిముద్ర నిర్ణయం మాత్రం రాష్ట్ర ప్రభుత్వానిదే. ఇప్పటి వరకు కోటీ 50 లక్షల వేలిముద్రలు వేస్తుండగా, ఇక నుంచి 3 కోట్ల వేలిముద్రలు వేయాల్సి ఉంటుందని రేషన్‌ డీలర్ల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు దివి లీలామాధవరావు తెలిపారు. దీనివల్ల క్యూలైన్లు పెరిగి తద్వారా కరోనా వ్యాప్తికి ఎక్కువ అవకాశం ఏర్పడుతుందన్నారు. ఇదంతా డీలర్లపై కక్షసాధింపు చర్యలా కనిపిస్తోందని ఆరోపించారు.