విశాఖలో మరో భూమిపై పెద్దలు కన్నేశారు

Published: Wednesday October 21, 2020

విశాఖ నగరం సమీపంలోని ఆనందపురం మండలానికి చెందిన తాటిశెట్టి తాతమ్మ ఆర్మీ సుబేదార్‌à°—à°¾ పదవీ విరమణ చేశారు. అది జాయింట్‌ ఆఫీసర్‌ కేడర్‌. సిపాయిగా పనిచేసిన వారికి మాత్రమే ప్రభుత్వం సాగు చేసుకోవడానికి గతంలో భూమి కేటాయించేది. ఆఫీసర్లకు ఇవ్వడం కుదరదు. అయితే,  తాతమ్మ తనకు సాగు చేసుకోవడానికి భూమి కావాలని దరఖాస్తు చేసుకోగా 1990లో పాలవలస సర్వే నంబర్లు 59/26, 59,32, 59/35లలో 5.4 ఎకరాలు కేటాయించారు. దీనిని పేదలకు ఇచ్చే విభాగంలో (à°¡à±€-పట్టా à°•à°¿à°‚à°¦) కేటాయించినట్టు రెవెన్యూ రికార్డుల్లో నమోదుచేశారు. అంటే, à°† భూమిని జీవితాంతం à°† కుటుంబం అనుభవించాలే తప్ప వేరొకరికి విక్రయించడానికి వీల్లేదు. అయితే...తాతమ్మ కుటుంబం మాత్రం మాజీ సైనికుడి కోటాలో తమకు భూమి ఇచ్చిందని ప్రచారం చేసుకుంది. 

ప్రభుత్వం ఇచ్చిన భూమిలో మామిడితోట వేసుకున్నారు. à°† తర్వాత తాతమ్మ చనిపోయారు. ఆయన భార్య కుసుమ కుమారి à°† భూమిని అమ్ముకోవడానికి అనుమతి కావాలని 2017లో జిల్లా అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. తమకు మాజీ సైనికుల కోటాలో ఇచ్చారని,  కేటాయించి పదేళ్లు దాటిపోయినందున అమ్ముకునే హక్కు ఉందని తెలిపారు. అప్పటి కలెకర్‌ ప్రవీణ్‌ కుమార్‌ à°† దరఖాస్తును కింది అధికారుల పరిశీలనకు పంపించారు. రెవెన్యూ రికార్డుల్లో అది à°¡à±€-పట్టా à°•à°¿à°‚à°¦ నమోదైందని, మాజీ సైనికుల కోటాలో లేదని తేలడంతో ఆమె దరఖాస్తును తిప్పి పంపించారు.

à°† భూమి వెబ్‌ల్యాండ్‌లో తాతమ్మ పేరుతో ఉండగా, వెంటనే దానిని ప్రభుత్వ భూమి జాబితా 22-ఏలో చేర్చారు. à°ˆ భూమి చేజిక్కించుకోవడానికి చాలాకాలంగా ఎదురు చూస్తున్న డీవీఎ్‌సఎ్‌సఆర్‌ఆర్‌ రాజు అనే వ్యక్తి కుసుమ కుమారితో విక్రయ ఒప్పందం చేసుకుని రిజిస్ట్రేషన్‌ కోసం ఆనందపురం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు. అది 22-ఏలో ఉన్నందున రిజిస్ట్రేషన్‌ చేయబోమని అధికారులు తిరస్కరించారు. దీనిపై సదరు రాజుకోర్టులో పిటిషన్‌ వేశారు. రాజుకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలిచ్చింది. à°† కాపీ రాజు చూపినా, రిజిస్ర్టేషన్‌ చేయకుండా సబ్‌రిజిస్ట్రార్‌ దీనిపై హైకోర్టులో అప్పీల్‌ చేశారు. 

 

కోర్టు ఆర్డర్‌ తెచ్చినా రిజిస్టర్‌ చేయకపోవడం ఏమిటంటూ... రూరల్‌ జిల్లాలో బాగా కథలు చెప్పే వైసీపీ ఎమ్మెల్యే రంగంలోకి దిగారు. రాజుతో దీనిపై డీల్‌ మాట్లాడుకొని సబ్‌ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి తెచ్చారు. దాంతో సబ్‌ రిజిస్ట్రార్‌ .. రాజు పేరు మీద à°† భూమి రిజిస్టర్‌ చేసేశారు. అయితే, à°† తర్వాత అది చేతులు మారాలంటే... కలెక్టర్‌ నుంచి నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ), 22-ఏ జాబితా నుంచి తొలగింపు వంటి కీలక ప్రక్రియలు జరగాల్సి ఉంది. à°† బాధ్యతను కూడా సదరు ఎమ్మెల్యేనే భుజాన వేసుకున్నారు. కలెక్టర్‌ కార్యాలయంలో ఇలాంటి వ్యవహారాలు నడిపించే ఓఅధికారిణితో మంతనాలు సాగించారు. ఇంతలో ఆమెను ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసేసింది. ఈలోగా అదే పార్టీలో ఎమ్మెల్యే వ్యతిరేక వర్గానికి à°ˆ విషయం తెలిసింది. మంత్రి పదవిరేసులో ఉండడం, స్వతంత్రంగా వ్యవహరిస్తూ...ఇక్కడి ఇన్‌చార్జికి తెలియకుండా అమరావతి స్థాయిలో రాజకీయాలు సాగిస్తుండడంతో ఆయన హవాకు బ్రేక్‌ వేయడానికి à°ˆ కేసును బయటకు తీశారు.

 

వారం క్రితం ఇద్దరు మంత్రులు, జిల్లా అధికారుల సమక్షంలో జరిగిన సమీక్షలో ఎమ్మెల్యే ఒత్తిళను ప్రస్తావించకుండా... 22-ఏ భూములను రిజిస్టర్‌ చేస్తున్నారంటూ రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారులపై అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. à°ˆ నేపథ్యంలో అధికార యం త్రాంగం మరోసారి దీనిపై పరిశీలన చేపట్టింది. పేదలకు ఇచ్చే కోటాలో భూమి ఇచ్చినందున... దానిని వారే అనుభవించాలి తప్ప వేరొకరికి అమ్మకూడదని, అదే విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ అప్పీల్‌ చేయాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, భూమి మాజీ సైనికుల కోటాలో ఇచ్చినట్టు రికార్డు లేదని, డీపట్టాగానే ఉందని ఆనందపురం  తహసీల్దార్‌  à°Ÿà°¿.వేణుగోపాల్‌ వెల్లడించారు.