ఏపీ విద్యార్థులు పొరుగు రాష్ట్రాలకు వలసలు

Published: Monday November 02, 2020

రాష్ట్రంలో విద్యాసంస్థల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ వివక్షపూరిత, కక్షసాధింపు ధోరణితో వాటి భవితవ్యం పెనుప్రమాదంలో పడింది. ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యనందించే వాతావరణం లేకపోవడంతో ఇక్కడి విద్యార్థులు తెలంగాణతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రకు వలసపోయే పరిస్థితి నెలకొంది. విద్యా సంస్థలను ప్రోత్సహించి, రాష్ట్రాన్ని విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకోకుండా ప్రభుత్వమే వివక్షతో వ్యవహరిస్తోందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇదే పరిస్థితులు కొనసాగితే పాఠశాలలు, కళాశాలలు నిర్వహించలేమంటూ ప్రైవేట్‌ యాజమాన్యాలు చేతులెత్తేసే పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థుల అవసరాలకు తగిన సంఖ్యలో ప్రభుత్వరంగ విద్యాసంస్థలను నెలకొల్పడం, ఉపాధ్యాయులను నియమించడం, మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యాలను కప్పిపుచ్చుకుంటున్న ప్రభుత్వం ప్రైవేట్‌రంగాన్ని సమూలంగా రూపుమాపేందుకు కంకణం కట్టుకుందని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. కొత్త విధానాలు, సంస్కరణల పేరుతో తరచూ  సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప కార్యాచరణ మచ్చుకైనా కనిపించడం లేదు. ఫీజుల నిర్ధారణ, నియంత్రణ, పర్యవేక్షణ కోసమంటూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన రెగ్యులేటరీ కమిషన్లు ఇప్పటి వరకు à°† దిశగా తెచ్చిన మార్పులు ఏమిటో స్పష్టత లేదు. సమస్యలను ఏకరువు పెట్టేందుకు వెళ్లిన  ప్రైవేట్‌ విద్యాసంస్థల యాజమాన్య ప్రతినిధులు, సంఘాల నేతలను అవమానించేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. 

 

  1. పాఠశాల విద్యలో ఇంగ్లీషు మీడియం పేరుతో ఏడాదిగా కాలయాపన చేశారు. పాఠ్యపుస్తకాలను సకాలంలో విద్యార్థులకు అందిస్తే ఇళ్ల దగ్గరే చదువుకునే వీలుండేది. ఆన్‌లైన్‌ క్లాసులపై చూపించిన ఆసక్తి ఇతర అంశాలపై చూపించలేదు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులపై రెగ్యులేటరీ కమిషన్‌కే స్పష్టత లేదు. గతేడాది ట్యూషన్‌ ఫీజుల్లో 30శాతం తగ్గించి తీసుకోవాలని ఇప్పుడు చెబుతున్నారు. ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎప్పుడో ఫీజులు వసూలు చేశారు. 
  2. ఇంటర్‌ అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో చేపడతామని 6నెలల క్రితమే ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. కానీ అందుకు ఏర్పాట్లు చేయడంలో విఫలమైంది. ప్రైవేట్‌ కాలేజీలకు తప్పనిసరిగా ఫైర్‌సేఫ్టీ సర్టిఫికెట్‌ అవసరమని తాజాగా అండర్‌టేకింగ్‌ లెటర్‌ తీసుకుని అందరికీ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. దీనిలో పెద్దఎత్తున అవినీతి చోటుచేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. 
  3. ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీల వ్యవహారంలో ప్రభుత్వం తొలినుంచీ కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందన్న అభిప్రాయాలున్నాయి. à°—à°¤ ప్రభుత్వ హయాంలో ఆదాయ వ్యయాల లెక్కలు సరిగ్గా చూపలేదని, మూడేళ్లుగా 25 శాతం కంటే తక్కువ అడ్మిషన్లు జరుగుతున్నాయని, నిబంధనలు పాటించడం లేదన్న కారణాలతో మూడోవంతు కాలేజీల అఫిలియేషన్‌ రద్దు చేయించి, కౌన్సెలింగ్‌లో లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. 
  4. పూర్తి ట్యూషన్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంటూ గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వం... కాలేజీల తగ్గింపు, ట్యూషన్‌ ఫీజుల్లో భారీ కోతతో భారం లేకుండా కుయుక్తులు పన్నుతోందని విమర్శలున్నాయి. పేరు ప్రతిష్ఠలున్న 23 ఇంజనీరింగ్‌ కాలేజీల ఫీజుల నిర్ధారించే విషయంలో కక్షసాధింపు ధోరణి అవలంబించిందన్న ఆరోపణలు వ్యక్తమయ్యాయి. కోర్టుల్లో వ్యతిరేక తీర్పువచ్చినా ఆయా కాలేజీలకు ఫీజులను పెంచకపోగా, రెండేళ్లనాటి బకాయిలు  చెల్లించకుండా ప్రభుత్వం నిలుపుదల చేసింది. రాజీకి తెచ్చుకుని, కేసులు ఉపసంహరించుకునే పరిస్థితి కల్పించారు. 
  5. కాలేజీల అఫిలియేషన్‌ రద్దు, ఫీజుల నిర్ధారణ విషయంలో à°’à°• సామాజిక వర్గమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. 
  6. రాష్ట్రంలోని ఆరు వర్సిటీలకు ఏడాదిగా రెగ్యులర్‌ వీసీ లేకుండా ఇన్‌చార్జిలతోనే మమ అనిపిస్తున్నారు. సెర్చ్‌ కమిటీల నివేదిక సీఎం వద్దే పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం.