పెద్ద నోట్ల రద్దుతో విజయాలు

Published: Sunday November 08, 2020

పెద్ద నోట్ల రద్దు వల్ల ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకత పెరిగిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. నవ భారతానికి ఇది గొప్ప వరం అని తెలిపారు. నల్లధనం తగ్గడం, పన్నుల చెల్లింపు పెరగడం వంటి సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. దేశ ప్రగతికి ఈ సత్ఫలితాలు గొప్ప ప్రయోజనం కలిగిస్తాయని పేర్కొన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసి నాలుగేళ్ళు పూర్తయిన సందర్భంగా మోదీ అనేక వివరాలను ట్వీట్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడం వల్ల పన్ను చెల్లింపులు మెరుగుపడిన విధానాన్ని మోదీ వివరించారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఆపరేషన్ క్లీన్ మనీ ప్రారంభమైందన్నారు. ట్విటర్ వేదికగా ఆయన తెలిపిన ఇతర వివరాలు...

రూ.13,000 కోట్లకుపైగా సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్‌ను టార్గెటెడ్ నాన్-ఫైలర్స్ చెల్లించారు. 

రూ.10 లక్షలు లేదా అంతకన్నా ఎక్కువ నగదును డిపాజిట్ చేసి, ఐటీ రిటర్నులను దాఖలు చేయని 3.04 లక్షల మందిని గుర్తించాం

 à°µà±€à°°à°¿à°²à±‹ 2.09 లక్షల మంది స్పందించి, సెల్ఫ్ అసెస్‌మెంట్ ట్యాక్స్ రూ.6,531 కోట్లు చెల్లించారు.

పెద్ద నోట్ల రద్దు తర్వాత మన దేశంలో పన్ను/జీడీపీ  నిష్పత్తి బాగా మెరుగుపడింది.

 2015-16 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.16.41 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న నోట్ల కన్నా 14.51 శాతం పెరిగాయి. ఇదే రేటుతో పెరిగితే, 2019-20 ఆర్థిక సంవత్సరాంతానికి చలామణీలో ఉండే నగదు విలువ రూ.28.49 లక్షల కోట్లు ఉండేది. అయితే 2019-20 ఆర్థిక సంవత్సరాంతానికి  రూ.24.20 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉన్నాయి. 

 

- à°šà°²à°¾à°®à°£à±€à°²à±‹ ఉండవలసిన నోట్లను తగ్గించడంలో పెద్ద నోట్ల రద్దు, అనంతరం డిజిటలైజేషన్ విజయవంతమైనట్లు స్పష్టమవుతోంది. రూ.4.28 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణీలో ఉండవలసిన అవసరం లేకుండా పోయింది.

 à°¦à±‡à°¶ భద్రతకు ముప్పును ఎదుర్కొనడంలో పెద్ద నోట్ల రద్దు పాత్ర కూడా ఉంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత నకిలీ నోట్ల సంఖ్య చాలా తగ్గింది. కొత్త నోట్లను ప్రవేశపెట్టడం వల్ల నకిలీ కరెన్సీని గుర్తించడం తేలికైంది. 

 à°Ÿà±†à°°à±à°°à°°à± ఫైనాన్సింగ్, లెఫ్ట్ వింగ్ అతివాదానికి ఫైనాన్సింగ్ తగ్గింది. జాతి వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు అందడంపై బ్రేకులు పడ్డాయి. - à°­à°¾à°°à°¤ దేశం డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టింది. 2020 అక్టోబరులో 207.16 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఎన్‌పీసీఐ గణాంకాల ప్రకారం, à°ˆ లావాదేవీల విలువ రూ.3.86 లక్షల కోట్లు. యూపీఐ ఫెసిలిటీకి 189 బ్యాంకులు అనుసంధానమయ్యాయి.