‘‘దేశీయ నినాదానికి’’ మద్దతు ఇవ్వాలని ప్రధాని మోదీ పిలుపు

Published: Monday November 09, 2020

దీపావళి వేడుకల సందర్భంగా భారత ప్రజలంతా ‘‘దేశీయ నినాదానికి’’ (వోకల్ ఫర్ లోకల్) మద్దతు ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ‘‘లోకల్ ఫర్ దివాళీ’’ని ప్రమోట్ చేయాలనీ.. పండుగల సీజన్ మొత్తం స్థానికంగా తయారైన వస్తువులను కొనేందుకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దేశీయ వస్తువులతో దీపావళి జరుపుకోవడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థలో నూతన జవసత్వాలు నింపవచ్చునని ప్రధాని పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారణాసిలో పలు పథకాలకు మోదీ ఇవాళ ప్రారంభోత్సవం చేశారు. à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘ఇవాళ మీరు సర్వత్రా వోకల్ ఫర్ లోకల్ నినాదంతో పాటు లోకల్ ఫర్ దివాళీ మంత్రాన్ని వింటున్నారు. వారణాసితో పాటు దేశంలోని ప్రజలంతా à°ˆ పండుగ సీజన్‌లో లోకల్ ఫర్ దివాళీ నినాదాన్ని ప్రమోట్ చేయాలని కోరుతున్నాను..’’ అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సగర్వంగా దేశీయ వస్తువులనే కొనుగోలు చేయడం ద్వారా... స్థానిక వస్తువుల గురించి మాట్లాడుతూ, వాటిని ప్రోత్సహించడం ద్వారా.. మన దేశీయ వస్తువులు మంచివి అన్న సందేశాన్ని ఇతరుల దృష్టికి తీసుకెళ్లవచ్చని ప్రధాని పేర్కొన్నారు. తద్వారా స్థానిక నినాదం శరవేగంగా విస్తరిస్తుందన్నారు. ‘‘దీనివల్ల స్థానిక వస్తువులు గుర్తింపునకు నోచుకోవడం మాత్రమే కాదు.. వాటిని తయారు చేసేవారి జీవితాల్లో కూడా దీపావళి వెలుగులు నింపగలం...’’ అని మోదీ పేర్కొన్నారు. స్థానిక వస్తువులను కొనుగోలు చేయడమంటే కేవలం ‘‘మట్టి ప్రమిదలు’’ కొనడం మాత్రమే కాదనీ... దీపావళికి ఉపయోగించే వస్తువులన్నీ స్థానిక తయారీ దారుల నుంచే కొనుగోలు చేయాలని కోరారు. అలా చేసినప్పుడే వారికి నిజమైన ప్రోత్సాహాన్ని అందించగలమని ప్రధాని స్పష్టం చేశారు.