వరద నష్టాలపై కేంద్ర బృందం స్పష్టీకరణ

Published: Wednesday November 11, 2020

 à°µà°°à°¦ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని కేంద్ర బృందం స్పష్టం చేసింది. వరద నష్టాన్ని పరిశీలించేందుకు రాష్ర్టానికి వచ్చిన కేంద్ర బృందం రెండో రోజైన మంగళవారం ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించింది. తూర్పుగోదావరిలో సౌరవ్‌ రాయ్‌, ఆయుష్‌ పునియా, శ్రావణ్‌ కుమార్‌ సింగ్‌, ఆర్‌బీ కౌల్‌ బృందం, పశ్చిమ గోదావరి జిల్లాలో ఓపీ సుమన్‌,  పొన్నుస్వామి, పి.దేవేంద్రరావు బృందం పర్యటించాయి. కాకినాడలోని కలెక్టరేట్‌లో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి నష్టం వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. వరదల వల్ల వివిధ రంగాలకు రూ.2,442 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. రైతులు రూ.422.6 కోట్ల మేర పంటను కోల్పోయారన్నారు. మౌలిక సదుపాయాలకు సంబంధించి రూ.2,019.44 కోట్ల నష్టం జరిగిందన్నారు. 1,078 గృహాలకు రూ.94 లక్షల మేర నష్టం కలిగిందన్నారు. 22 మైనర్‌, 9 మీడియం, 95 మేజర్‌ కాలువలకు గండ్లు పడ్డాయన్నారు. మరమ్మతులకు రూ. 21.39 కోట్లు అవసరమన్నారు. పశ్చిమగోదావరిలో నందమూరు వద్ద రైతులతో కేంద్ర బృందం చర్చించింది. ఎర్రకాలువ వరద వల్ల తీవ్రంగా నష్టపోయామని వారికి రైతులు వివరించారు.

 

అనంతరం నందమూరు అక్విడెక్ట్‌ను కేంద్ర బృందం పరిశీలించింది. తమ్మిలేరు, ఎర్రకాలువ వరదలతో  రైతులు నష్టపోతున్న, గట్లు దెబ్బ తింటున్న విషయాలను జిల్లా అధికారులకు కేంద్ర బృందానికి వివరించారు. రెండు వాగులను వెడల్పు చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అనంతరం నిడదవోలు మండలం కంసాలిపాలెం, సింగరాజుపాలెంలో బృందం పర్యటించింది. దెబ్బతిన్న ఉద్యాన పంటలను పరిశీలించింది. ఎకరాకు రూ.80 వేలు నష్టపోయామని à°…à°°à°Ÿà°¿ రైతులు వివరించారు. జిల్లాలో వరి, ఉద్యాన పంటల నష్టాన్ని జాయింట్‌ కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి వివరించారు. దాదాపు 82 వేల హెక్టార్లలో వరి, 2,035 హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతిన్నట్టు తెలిపారు. కొవ్వూరులో ఫొటో ఎగ్జిబిషన్‌ను బృందం పరిశీలించింది. పాతపోలవరం వద్ద వరదలకు కొట్టుకుపోయిన నక్లెస్‌ బండ్‌ను సందర్శించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని బృందం విలేకరులకు వెల్లడించింది.