ఏపీలోని కొత్త జిల్లాలు ఇవేనంటూ వైరల్

Published: Thursday November 12, 2020

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియకు ప్రభుత్వం దాదాపు à°°à°‚à°—à°‚ సిద్ధం చేసింది. పోలీసు శాఖలోని అన్ని విభాగాల్లోనూ బదిలీలు ఆపేయాలని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్న తరుణంలో కానిస్టేబుల్‌ నుంచి పైస్థాయి అధికారి వరకూ ఏ ఒక్కరినీ బదిలీ చేయవద్దని స్పష్టంగా నిర్దేశించారు. జనరల్‌ రైల్వే పోలీస్‌, సీఐడీ, ఇంటెలిజెన్స్‌, ఏపీఎస్పీతోపాటు శాంతిభద్రతల విభాగాలైన రేంజ్‌లు, ఎస్పీల పరిధిలో తక్షణమే à°ˆ నిర్ణయం అమల్లోకి వస్తుందన్నారు. డీజీపీ ఆదేశాలతో కొత్త జిల్లాల ఏర్పాటుపై త్వరలోనే వైసీపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుందన్న విషయం స్పష్టమైంది.

ఏపీలో 17 కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తామంటూ à°—à°¡à°¿à°šà°¿à°¨ ఎన్నికల సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేస్తామంటూ పార్టీ ఎన్నికల ప్రణాళికలో వైసీపీ చెప్పింది. కానీ.. ఇప్పుడు కొత్త జిల్లాల సంఖ్య 17కు మించే పరిస్థితి కనిపిస్తోంది. పార్లమెంట్ నియోజకవర్గాలను ఆధారంగా చేసుకుని జిల్లాలు ఏర్పాటు చేస్తే ఇబ్బందులు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం జిల్లాల సంఖ్య 32కు పెరిగే అవకాశమున్నట్లు సమాచారం. పార్లమెంట్ స్థానాలతో పాటు స్థానిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని అసెంబ్లీ నియోజవర్గాలను కూడా జిల్లాలుగా మార్చాలని జగన్ సర్కార్ భావిస్తున్నట్లు తెలిసింది. సోషల్ మీడియాలో ఆంధ్రప్రదేశ్(ప్రతిపాదిత) 32 కొత్త జిల్లాలు, వాటి పరిధిలోకి వచ్చే అసెంబ్లీ నియోజకవర్గాలు ఇవేనంటూ à°“ జాబితా చక్కర్లు కొడుతోంది