100 రోజుల పాటు దేశవ్యాప్త యాత్ర

Published: Saturday November 14, 2020

 à°¬à±€à°œà±‡à°ªà±€ ఊపిరి తీసుకోవడం లేదు. దేశవ్యాప్తంగా విజయాల పరంపర కొనసాగుతున్నా... ‘దీర్ఘ దృష్టి’ తో మరిన్ని వ్యూహాలను రచిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని à°† పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దేశవ్యాప్తంగా à°“ యాత్రను చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ‘‘రాష్ట్రీయ విస్తృత్ ప్రవాస్’ అన్న పేరుతో 100 రోజుల పాటు యాత్రను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఏయే రాష్ట్రంలో ఎన్ని రోజులు పర్యటించాలన్నది కూడా సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవం పొందిన రాష్ట్రాలు, నియోజకవర్గాలపై à°ˆ యాత్ర ద్వారా ఎక్కువ ఫోకస్ పెట్టారు. అక్కడి క్షేత్ర స్థాయి అంచనాలను ఆకళింపు చేసుకోనున్నారు. ఇక... à°ˆ యాత్రలో భాగంగా నడ్డా.. వివిధ రాష్ట్రాల్లో ఉన్న శాసన సభ్యులు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, తదితరులతో సమావేశమవుతారు.

పార్టీ పటిష్ఠత, విస్తరణ, పొత్తులు, మరిన్ని సీట్లు ఎలా సాధించొచ్చు, రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసే వ్యక్తులు.. ఇలా పలు విషయాలను క్షుణ్ణంగా చర్చించనున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ రాష్ట్ర శాఖలు పార్టీ విస్తరణకు చేస్తున్న కార్యక్రమాలు, చేసిన కార్యక్రమాలను నడ్డా ముందు ఉంచనున్నారు. వీటన్నింటినీ ఆధారంగా చేసుకొని, ఇకపై పార్టీ విస్తరణ ఎలా చేయాలన్న దానిపై ఆయన శ్రేణులకు మార్గనిర్దేశనం చేయనున్నారని పార్టీ నేతలు అంటున్నారు. అయితే దేశవ్యాప్తంగా కోవిడ్ ప్రభావం ఉంది కాబట్టి... యాత్ర సందర్భంగా జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. నడ్డా సమావేశమయ్యే హాలులో 200 మంది కంటే ఎక్కువగా ఉండకుండా స్థానిక పార్టీలు బాధ్యత వహించనున్నాయి. ‘‘నడ్డా సమావేశమయ్యే గదుల దగ్గర టెంపరేచర్‌ను పరీక్షించే పరికరాలు, శానిటైజర్లు, మాస్కులు ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. శాలువాలు, బోకేలు ఇచ్చే సంప్రదయానికి ప్రస్తుతానికి స్వస్తి పలికాం. ప్రతి అంశంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.’’ అని పార్టీ నేతలు తెలిపారు.