తగ్గిన కరోనా కేసులు

Published: Monday November 16, 2020

ఏపీని వణికించిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కరోనా ఉధృతిలో రోజుకు 10వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. అయితే రాష్ట్రంలో కరోనా ఇప్పుడు అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా 2వేలలోపే కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు కేసుల సంఖ్య కనిష్టంలోకి పడిపోయింది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 753 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి రాష్ట్రంలో 8,54,764 కరోనా కేసులు చేరాయి. 24 గంటల్లో కరోనాతో 13 మంది చనిపోయారు. ఇప్పటివరకు కరోనాతో రాష్ట్రవ్యాప్తంగా 6,881 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,892 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి 8,29,991 మంది డిశ్చార్జ్ అయ్యారు. కరోనాతో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నంలో ఇద్దరు చొప్పున మృతి చెందారు. అనంతపురం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మృతి చెందారు