రుణం సకాలంలో కట్టే అలవాటు రావాలి

Published: Wednesday November 18, 2020

 ‘రైతులకు à°Žà°‚à°¤ చేసినా తక్కువే. వడ్డీ రాయితీ, ఏ నెల పంట నష్టం à°† నెలే చెల్లించడం ద్వారా మొదటిసారిగా ప్రభుత్వంపై విశ్వసనీయత కలుగుతోంది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలాంటి భరోసా ఇవ్వలేదు. పంట రుణాలు సకాలంలో చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ కడుతుందన్న నమ్మకాన్ని రైతుల్లో కల్పించగలిగాం. దీని వల్ల రైతులకు కూడా పంట రుణాలు సకాలంలో చెల్లించడం à°’à°• అలవాటుగా మారుతుంది’’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్ము 14.58లక్షల రైతులకు రూ.510.32కోట్లు, అక్టోబరు పంట నష్టం ఇన్‌పుట్‌ సబ్సిడీ రూ.132కోట్ల చెల్లింపులను మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో  సీఎం జగన్‌ మీట నొక్కి రైతుల ఖాతాలకు నగదు జమ చేశారు. రైతులకిచ్చిన ప్రతి హామీ కూడా అమలు చేశామని, సున్నావడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ అందులో భాగమేనని à°ˆ సందర్భంగా జగన్‌ అన్నారు. ‘‘ప్రభుత్వం ఏర్పడి 18నెలలు. ఎన్నికల్లో హామీలిచ్చి, à°† తర్వాత పట్టించుకోనివారిని చూశాం. మా ప్రభుత్వం మాత్రం మేనిఫెస్టోలోని హామీలు 90ు అమలు చేసింది. ఇచ్చినమాట నిలబెట్టుకున్నందువల్లే మా ప్రజాప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని ప్రజల్లోకి, గ్రామాల్లోకి వెళుతున్నారు. రైతుభరోసా కేంద్రాల గురించి మేనిఫెస్టోలో చెప్పలేదు. కానీ, వాటిని ఏర్పాటు చేశాం. 50లక్షల కుటుంబాలకు రైతుభరోసా సొమ్ము ఇచ్చాం’’ అని తెలిపారు. 2019 ఖరీఫ్‌ రుణాలకు సున్నా వడ్డీ సొమ్ము జమచేసి మాట నిలబెట్టుకుంటున్నామని చెప్పారు. ‘‘à°—à°¤ ప్రభుత్వం  రైతులను ఎలా మోసం చేసిందో చూశాం. రుణమాఫీ చేస్తామని అప్పట్లో చేయలేదు.  2015-16లో రుణమాఫీ పూర్తవుతుందని ఆశించినా, అప్పటి ప్రభుత్వం చేయలేదు. 2015-18 సున్నావడ్డీ సొమ్ము కట్టకపోవడంతో రూ.1180కోట్లు బకాయి పడింది. రైతుల పట్ల బాధ్యత, మమకారంతో మా ప్రభుత్వం à°† బకాయి చెల్లించింది.

 

అలాగే విద్యుత్‌ బకాయిలు, ధాన్యం బకాయిలు ఇస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టానికి అదే సీజన్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తామని చెప్పాం. చెప్పినట్టే అక్టోబరులో పంట నష్టానికిగాను 1,97,525 రైతు కుటుంబాలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నాం’’ అని జగన్‌ చెప్పారు. అర్హత ఉన్నా లబ్ధి అందకపోతే కంగారు పడొద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రతి పథకం అందుతుందని జగన్‌ భరోసా ఇచ్చారు. ఎవరికైనా పథకం అందకపోతే సచివాలయాల్లో సంప్రదించాలని, లేదంటే వలంటీర్‌ని కలిసి చెప్పాలని, టోల్‌ఫ్రీ నంబర్‌ 155251కు కాల్‌ చేయాలని సీఎం సూచించారు. ‘వైఎస్సార్‌ జలకళ’ ద్వారా పేద రైతులకు ఉచిత బోర్లు వేయిస్తున్నామని, మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్నామని తెలిపారు. రైతులకు పగటి పూటే నాణ్యమైన విద్యుత్‌ సరఫరాకు మిగిలిన 10ు ఫీడర్లు కూడా ఈనెలాఖరులోగా సిద్ధమవుతాయని, పంటల బీమా పథకంలో రూ.1,800కోట్ల విలువైన క్లెయిమ్‌లను డిసెంబరులో చెల్లిస్తామని పేర్కొన్నారు. రైతులు, మహిళలకు మరింత ఆదాయం వచ్చేలా ‘అమూల్‌’తో ఒప్పందం చేసుకొన్నామని, అందులోభాగంగా మూడు జిల్లాల్లో ఈనెల 26నుంచి తొలి దశ పాల సేకరణ ప్రారంభిస్తున్నామని, రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) పక్కనే 9,800 బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు. à°ˆ కార్యక్రమంలో మంత్రులు కన్నబాబు, వేణుగోపాలకృష్ణ, పేర్ని నాని, అవంతి శ్రీనివాస్‌, అగ్రిమిషన్‌ వైస్‌ చైర్మన్‌ నాగిరెడ్డి, సంబంధితశాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.