నేటి నుంచి తుంగభద్ర పుష్కరాలు

Published: Friday November 20, 2020

తుంగభద్ర పుష్కరాలకు రూ.వందల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఏర్పాట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఘాట్ల వద్ద మోకాల్లోతు బురద దర్శనమిస్తుండగా... నీళ్లు లేక ఘాట్లు వెలవెలబోతున్నాయి. చెత్త, వ్యర్థాలు, పాకుడుతో నిండిపోయి దగ్గరకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. కరోనా దృష్ట్యా పుష్కర స్నానాలకు అనుమతులు రద్దు చేసిన ప్రభుత్వం జల్లు స్నానాలకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రూ.100.91 కోట్లతో రోడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయాలని ఆదేశించినా కర్నూలు టౌన్‌ మినహా రోడ్లు వేసిన దాఖలాల్లేవు. సీఎం జగన్‌ హాజరు కానున్న సంకల్బాగ్‌ పుష్కర ఘాట్ల కాలనీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

 

ఘాట్ల సమీపంలో చిరు వ్యాపారులపై ఆంక్షలు విధించారు. 2008 నాటి పుష్కర ఏర్పాట్లను గుర్తు చేసుకుంటోన్న ప్రజలు ప్రస్తుత పరిస్థితిని చూసి పెదవి విరుస్తున్నారు. పుష్కరాలకు అత్యవసరమైన నీటి విడుదలపై కొనసాగుతున్న ప్రతిష్టంభన ఎట్టకేలకు తొలగింది. సీఎం జగన్‌ పుష్కరాలను ప్రారంబించేందుకు శుక్రవారం కర్నూలుకు వస్తుండటంతో పర్యటన ఏర్పాట్లపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, కార్మికశాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, కలెక్టర్‌ వీర పాండియన్‌, ఎస్పీ ఫక్కీరప్ప, నీటి పారుదలశాఖ ఎస్‌à°ˆ శ్రీరామచంద్రమూర్తి తదితరులతో సమీక్షించారు. అధికారుల విజ్ఞప్తి మేరకు మంత్రులు సుంకేసుల జలాశయానికి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న 2,600 క్యూసెక్కుల ప్రవాహంతో పాటు à°ˆ జలాశయం నుంచి మరో 4వేల క్యూసెక్కులు మొత్తం 6,600 క్యూసెక్కుల నీటిని పుష్కరాల కోసం నదిలోకి వదలాలని నిర్ణయం తీసుకున్నారు.