2 వరుసల రోడ్లపైనా టోల్‌ప్లాజాలు

Published: Friday November 20, 2020

ఆదాయ వనరుల అన్వేషణ ప్రారంభించిన సర్కారు రాష్ట్ర రోడ్లపై టోల్‌ ఫీజు వసూలు చేయాలనుకుంటోంది. à°ˆ మేరకు ఏపీ రాష్ట్ర రోడ్ల ఫీజు విధానం రూల్స్‌-2020ను తీసుకొస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 2007లో తీసుకొచ్చిన టోల్‌ఫీజు పాలసీ స్థానంలో కొత్తగా దీన్ని అమలు చేయనున్నారు. దీన్నే నూతన టోల్‌ పాలసీగా పిలుస్తున్నారు. ఇప్పటికే రోడ్ల జాబితాను సిద్ధం చేశారు. త్వరలో వాటినీ అధికారికంగా ప్రకటించనున్నారు. 

రాష్ట్రంలో రహదారులపై టోల్‌ వసూలుకు ఉమ్మడి ఏపీలో 2007లోనే పాలసీని తీసుకొచ్చారు. అయితే, అది కార్యరూపంలోకి రావడానికి అవసరమైన రూల్స్‌ను 2009లో విడుదల చేశారు. తొలుత నార్కట్‌పల్లి-అద్దంకి వంటి రాష్ట్ర రహదారులపై టోల్‌ ఫీజు వసూలు చేశారు. ఇతర రోడ్లపై కూడా ప్లాజాలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినా తీవ్ర విమర్శలు రావడంతో నాటి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. రాష్ట్ర విభజన తర్వాత 2016లోనూ దీనిపై à°“ ఆలోచన చేశారు. ప్రభుత్వ ఆలోచనపై విమర్శలు రావడంతో వెనక్కి తగ్గారు. ఇప్పుడు ఇదే అంశం మరోసారి తెరపైకి వచ్చింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సర్కారు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంతోపాటు రహదారుల స్వయం అభివృద్ధికి వీలు కల్పించే పేరిట టోల్‌పాలసీని మార్చింది.

 

2, 4, అంతకన్నా ఎక్కువ వరుసల రహదారులపై టోల్‌ వసూలు చేయాలని కొత్త పాలసీ చెబుతోంది. కొత్త రోడ్ల నిర్మాణం, నిర్వహణను దృష్టిలో పెట్టుకొని పాలసీని రూపొందించారు. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం, పూర్తిగా ప్రైవేటు పెట్టుబడులతో నిర్మించే రహదారులపై వీటిని వసూలు చేస్తారు. à°ˆ పాలసీ అమలుకు ముందు కుదిరిన ఒప్పందాలు, కాంట్రాక్ట్‌లకు తాజా రూల్స్‌ వర్తించవని స్పష్టం చేశారు. రహదారుల నిర్వహణలో భాగంగా పెట్టుబడి పెట్టిన కాంట్రాక్టు సంస్థ, ఏజెన్సీకి టోల్‌వసూలు బాధ్యత అప్పగిస్తారు. నిర్ధిష్ట గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం మరో సంస్థ లేదా ఏజెన్సీతో టోల్‌ ఫీజు వసూలును కొనసాగించుకునేలా వెసులుబాటు ఉంది. కొత్తగా నిర్మించే రాష్ట్ర, జిల్లా ప్రధాన రహదారులు, 4 వరుసల రోడ్లను టోల్‌ఫీజుకు ఎంపిక చేయనున్నారు. ఎంపిక చేసిన రోడ్లపై ఒకే మార్గంలో 30 కిమీ పరిధిలో టోల్‌ప్లాజాను ఏర్పాటు చేస్తారు. మున్సిపాలిటీలు, నగరాలకు పది కిలోమీటర్ల దూరంలో వాటిని ఏర్పాటు చేస్తారు. à°’à°• వేళ మున్సిపాలిటీల పరిధిలోనే 20 కోట్లు, అంతకన్నా ఎక్కువ నిధులతో భారీ వంతెన, టన్నెల్‌, రోడ్లను నిర్మిస్తే వాటిపై కూడా టోల్‌ఫీజు వసూలుకు అవకాశమిచ్చారు.