హైదరాబాద్‌కు ప్రధాని మోదీ రాక

Published: Thursday November 26, 2020

ఈనెల 29à°¨ ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్నారు. ఆకస్మికంగా ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన ఖరారైంది. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమంలో మోదీ పాల్గొననున్నారు. భారత్ బయోటెక్‌లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని ప్రధాని పరిశీలించనున్నారు. ప్రత్యేక విమానంలో సాయంత్రం 4:10à°•à°¿ హకీంపేట్ ఎయిర్‌పోర్టుకు ప్రధాని చేరుకోనున్నారు. 29à°¨ సాయంత్రం 5:10à°•à°¿ తిరిగి మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు.  జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రధాని మోదీ రాక ఉత్కంఠ రేపుతోంది. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారానికి భారతీయ జనతాపార్టీ అతిరథ మహారథులంతా తరలిరానున్నారు. ఎన్నికల ప్రచారం చివరి రోజైన ఈనెల 29à°¨ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌à°·à°¾ నగరానికి రానున్నారు. సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గంలో నిర్వహించే రోడ్‌ షోలో అమిత్‌ à°·à°¾ పాల్గొంటారు. 

 

శుక్రవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, హైదరాబాద్‌, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ప్రచారం చేయనున్నారు. 28à°¨ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మేధావుల సభకు హాజరవుతారు. అనంతరం, మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో జరిగే రోడ్డు షోలో నడ్డా పాల్గొంటారు.