అన్నీ అమరావతిలో ఉంటేనే అది అమలు

Published: Friday November 27, 2020

‘‘కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టానికి అనుగుణంగా రాజధాని ఏర్పాటైంది. దాన్ని మార్చాలంటే... విభజన చట్టాన్నీ సవరించాల్సిందే’’ అని న్యాయవాది అంబటి సుధాకరరావు హైకోర్టుకు వివరించారు. రాజధానికి భూములిచ్చిన రైతులతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించడం సరికాదన్నారు. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు పరస్పరం విరుద్ధమైనవని వివరించారు. సీఆర్‌డీఏ రద్దు చట్టంలో రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ ఉందని... దానిని అమలు చేయాలంటే శాసన, కార్యనిర్వహణ, న్యాయవ్యవస్థలు కూడా అమరావతిలో ఉండాల్సిందేనని స్పష్టంచేశారు. కానీ... అందుకు విరుద్ధంగా పాలనా వికేంద్రీకరణ చట్టం పేరిట రాష్ట్రప్రభుత్వం 3రాజధానుల ఏర్పాటుకు సిద్ధమైందన్నారు.

 

  రాజధాని అంశాలకు సంబంధించిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, న్యాయమూర్తులు జస్టిస్‌ à°Žà°‚.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం రోజువారీ తుదివిచారణ చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గురువారం ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ కార్యదర్శి రామారావు, న్యాయవాది à°‡.పాండురంగ, చెన్నుపాటి సింగయ్య, షేక్‌ మునీర్‌బాషా, టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌, పాటిబండ్ల వెంకట సుధాకర్‌, జి.అప్పారావు తదితరుల పిటిషన్లపై విచారణ జరిగింది. పిటిషనర్లలో à°’à°•à°°à°¿ తరఫున అంబటి సుధాకరరావు వాదనలు వినిపిస్తూ... రాజధానిలో చట్టబద్ధంగా నిర్మితం కావాల్సిన వాటిని వేరే ప్రాంతాలకు తరలిస్తే సీఆర్‌డీఏ చట్టం ద్వారా రైతులకు దక్కిన హక్కులను రక్షించలేరన్నారు. అందువల్ల అమరావతిలో అర్ధంతరంగా నిలిచిపోయిన అభివృద్ధి పనుల్ని కొనసాగించేలా యంత్రాంగాన్ని ఆదేశించాలన్నారు.   à°¶à°¾à°¸à°¨à°¸à°­à°¨à± ఎక్కడ నిర్వహించాలనే అంశం గవర్నర్‌ పరిధిలోనిదని, అమరావతిలో శాసన రాజధాని ఏర్పాటు చేస్తామని చట్టం చేయడమంటే గవర్నర్‌ పరిధిలో జోక్యం చేసుకోవడమేనని న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్‌ బాబు హైకోర్టుకు వివరించారు. గవర్నర్‌ నిర్ణయంతో ఎక్కడైనా శాసనసభను నిర్వహించగలుగుతున్నప్పుడు ఇక శాసన రాజధాని అనేదానికి నిర్వచనం ఎక్కడుంటుందని ప్రశ్నించారు. విభజన చట్టంలో సెక్షన్‌ 31(2) మేరకు హైకోర్టు ప్రధాన బెంచ్‌ అమరావతిలో ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి నోటిఫై చేశారని దానిని మార్చలేరని తెలిపారు. ఏపీ కోసం à°’à°• రాజధాని ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని గుర్తుచేశారు. à°ˆ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ‘రాజధాని నిర్ణయానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారంపై విభజన చట్టంలోగానీ, సీఆర్‌డీఏ చట్టంలో గానీ పేర్కొనలేదు కదా’ అని వ్యాఖ్యానించింది. ఇందుకు ఇంద్రనీల్‌బాబు సమాధానమిస్తూ.. సీఆర్‌డీఏ చట్టం ఏపీకి కొత్త రాజధాని ఏర్పాటుకు సంబంధించినదేనన్నారు