వచ్చే ఏడాదికి వ్యాక్సీన్లు?

Published: Sunday November 29, 2020

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఏ రేంజ్‌లో భయపెడుతుందో వేరే చెప్పక్కర్లేదు. à°ˆ వైరస్‌ను నియంత్రించేందుకు ప్రపంచ దేశాలన్నీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. వైరస్‌ను నిరోధించే వ్యాక్సీన్లు తయారు చేయడానికి బడా బడా ఫార్మా కంపెనీలు పరిశోదనలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని మంచి పలితాలు కూడా కనిపిస్తున్నాయి. వీటి గురించి ఇంటర్నేషనల్ పెడరేషన్ ఆఫ్ ఫార్మాసూటికల్ మ్యానుఫాక్యరర్స్ అండ్ అసోసియేషన్స్‌ (ఐఎఫ్‌పీఎమ్‌ఏ) డైరెక్టర్ జనరల్ థామస్ క్యూనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

 

ఇటీవలే ఫైజర్, బయాన్‌టెక్ ఫార్మా కంపెనీలు తయారు చేసిన కరోన టీకా 90శాతంపైగా సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో ప్రపంచం మొత్తం à°ˆ కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపింది. ఇదే పద్ధతిలో మోడర్నా తయారు చేస్తున్న వ్యాక్సీన్, ఆస్ట్రా జెనెకా ప్రయోగంలో ఉన్న టీకా కూడా సత్ఫలితాలనే ఇస్తున్నాయని ఆయా కంపెనీలు వెల్లడించాయి. à°ˆ టీకాలన్నీ క్లినికల్ ట్రయల్స్ దాదాపు ముగించుకొని మార్కెట్లో రిలీజ్ చేయడానికి అవసరమైన అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ వీటిలో ఏ వ్యాక్సీన్‌కు కూడా à°ˆ అనుమతులు లభించలేదు. à°ˆ విషయాన్నే క్యూనీ కూడా ప్రస్తావించారు.