దుమ్మురేపిన జీఎస్‌టీ

Published: Tuesday December 01, 2020

 à°¨à°µà°‚బరులో జీఎస్టీ వసూళ్లు దుమ్మురేపాయి. ఏకంగా రూ. 1.04 లక్షల కోట్లు వసూలైనట్టు ప్రభుత్వం మంగళవారం వెల్లడించింది. అక్టోబరులో రూ. 1.05 లక్షల కోట్లు వసూలు కాగా, ఈనెలలో కొంతమేర తగ్గింది. అయితే, వరుసగా రెండు నెలల్లోనూ లక్షల కోట్ల మార్కు దాటడం మార్కు దాటడం గమనార్హం. గతేడాది ఇదే నెలలో రూ. 1,03,491 కోట్లు వసూలు కాగా, ఈసారి రూ. 1.04 కోట్లు వసూలైంది. 

 

నవంబరు జీఎస్టీ వసూళ్లలో సెంట్రల్ జీఎస్టీ (సీజీఎస్టీ) రూ. 19,189 కోట్లు, స్టేట్ జీఎస్టీ (ఎస్‌జీఎస్టీ) రూ. 25,540 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) రూ. 51,992 కోట్లు, సెస్ à°•à°¿à°‚à°¦ రూ.8,242 కోట్లు ఉన్నాయి. గతేడాది ఇదే నెలతో పోలిస్తే వస్తువుల దిగుమతి ద్వారా à°ˆ నెలలో సమకూరిన ఆదాయం 4.9 శాతం అధికం, దేశీయ లావాదేవీలు (సేవల దిగుమతి) ద్వారా సమకూరిన ఆదాయం 0.5 శాతం ఎక్కువని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

 

2019-20 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 12 నెలలకు గాను 8 నెలల్లో లక్ష కోట్ల మార్కును చేరుకోవడం గమనార్హం. అయితే, à°ˆ ఆర్థిక సంవత్సరంలో మాత్రం కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించింది. ఏప్రిల్‌లో రూ. 32,172 కోట్లు, మేలో రూ. 62,151 కోట్లు, జూన్‌లో రూ. 90,917 కోట్లు, జులైలో రూ. 87,422 కోట్లు, ఆగస్టు రూ. 86,449 కోట్లు వసూలు కాగా, సెప్టెంబరులో రూ.95,480 కోట్లు వసూలయ్యాయి.