తుంగభద్ర పుష్కరాలు ఓ ఫ్లాప్‌

Published: Wednesday December 02, 2020

తుంగభద్ర పుష్కరాలు మంగళవారంతో ముగిశాయి. పుష్కరం అంటేనే స్నానం, అర్ఘ్యం, పిండప్రదానం అని నమ్మిన భక్తులు చివరిరోజు వరకూ అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నాలుగేళ్ల క్రితం జరిగిన కృష్ణా పుష్కరాలు, అప్పటి ఏర్పాట్లను గుర్తుచేసుకుంటూ నిట్టూరుస్తున్నారు. కరోనా పొంచి ఉందని సర్ది చెప్పుకున్నా.. పక్కనే ఉన్న అలంపూర్లో నిత్యం వేలాది మంది స్నానాలు చేశారు. ఏపీలో స్నానాలు రద్దు చేశామని ప్రభుత్వం ముందుగానే  ప్రకటించింది. స్నానం చేయడానికి వచ్చినవారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. భక్తులకు భద్రత కల్పించడంలో యంత్రాంగం విఫలమైంది. కర్నూలు జిల్లాలో మంత్రాలయం మినహా ఎక్కడా భక్తుల రద్దీ కనిపించలేదు. అక్కడ ఎలాంటి ఆంక్షలు లేకుండా భక్తులు నదీస్నానాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం అలంపూర్లోనూ అదే పరిస్థితి 12రోజుల పాటు కనిపించింది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివెళ్లారు.

 

పన్నెండు రోజుల పాటు జరిగిన పుష్కరాల్లో కార్తీక పౌర్ణమి, ఆదివారం మినహా ఘాట్లలో భక్తులే కరువయ్యారు. గతనెల 29à°¨ ఆదివారం ఉదయం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు పౌర్ణమి ఉండటంతో సంకల్‌బాగ్‌ ఘాట్‌, సుంకేసుల, మంత్రాలయంలోని ఘాట్లు కలిపి 6, 7 ఘాట్లలో భక్తుల సందడి కనిపించింది. జిల్లాలో 23 ఘాట్లకు గాను తక్కినవన్నీ బోసిపోయాయి. 2016లో జరిగిన కృష్ణా పుష్కరాల వైభవాన్ని à°ˆ సందర్భంగా భక్తులు గుర్తు చేసుకుంటున్నారు. భారీ భద్రత, పకడ్బందీ ఏర్పాట్ల నడుమ à°† పుష్కరాలు జరగ్గా... ఇప్పుడు పేలవమైన ఏర్పాట్లతో, భక్తుల కోసం ఎదురుచూపులు చూడటంతోనే పష్కరాలు ముగిసిపోయాయని విమర్శిస్తున్నారు.