అంతర్గత పవర్‌ బ్యాకప్‌ లేకుండానే బేస్‌స్టేషన్లు..

Published: Tuesday December 08, 2020

రాష్ట్రంలో భూముల సమగ్ర సర్వే కోసం ప్రభుత్వం వినియోగిస్తున్న కంటిన్యుయస్‌ ఆపరేటింగ్‌ రిఫరెన్స్‌ స్టేషన్స్‌ (కార్స్‌) టెక్నాలజీ పనితీరును మరింత మెరుగుపరచుకునే సాఫ్ట్‌వేర్‌, సాంకేతిక అంశాల్లో కీలకమైన ప్రమాణాల్లేవని సర్వే ఆఫ్‌ ఇండియా తేల్చిచెప్పింది. దాని నివేదికలోని అంశాలను పరిశీలిస్తే అధికారులు ప్రభుత్వాన్ని ఎలా తప్పుదోవ పట్టించి ఆయా కొనుగోళ్లు జరిపారో ప్రస్ఫుటంగా బోధపడుతుంది. మొదట్లో ఎస్‌వోఐతో సంబంధాలంటేనే వారు ఆమడదూరం జరిగారు. దానికంత టెక్నాలజీ దన్ను లేదని ఎద్దేవా కూడా చేశారు. అయితే.. సర్వే శాఖకు సిద్ధార్థ్‌ జైన్‌ కమిషనర్‌à°—à°¾ వచ్చాక అంతా మారిపోయింది. తనకన్నా ముందు ఏం జరిగిందన్నది పక్కనపెట్టి, బేషజాలకు పోకుండా ఎస్‌వోఐ సాంకేతిక సహకారాన్ని, మార్గనిర్దేశాన్ని ఆయన కోరారు. డ్రోన్‌ సర్వేచేయాలని విజ్ఞప్తి చేశారు. à°ˆ మేరకు à°°à±€ సర్వే ప్రాజెక్టుపై నైపుణ్య మార్గనిర్దేశం కోరుతూ రెవెన్యూ శాఖ నుంచి సర్వేయర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియాకు లేఖ వెళ్లింది. అప్పటికే కార్స్‌ సర్వే తీరును పరిశీలించడం మొదలుపెట్టిన సర్వే ఆఫ్‌ ఇండియా.. దాని లోగుట్టు విప్పింది. పలు తప్పులను ఎత్తిచూపి వాటిని సరిదిద్దుకోవాలని సూచించింది.

 

ఎస్‌వోఐ వద్ద ఉన్న కార్స్‌ బేస్‌ స్టేషన్‌ రిసీవర్లు అత్యాధునికమైనవి. టెక్నాలజీపరంగా అత్యుత్తమ ప్రమాణాలను కలిగి ఉన్నాయి. మన రాష్ట్రం వద్ద ఉన్న రిసీవర్స్‌ కేవలం 20 హెడ్జెస్‌, అంతకన్నా ఎక్కువ సామర్థ్యం కలిగి ఉండగా.. ఎస్‌వోఐ వద్ద 50 హెడ్జెస్‌ నుంచి 600 సెకండ్స్‌ వరకు ఉన్నాయి. 

 

ఏపీ బేస్‌స్టేషన్లకు విద్యుత్‌ సరఫరాలో అనూహ్యంగా అంతరాయం ఏర్పడితే.. వాటి కోసం బయటి నుంచి బ్యాటరీ బ్యాకప్‌ పెట్టారు. మరి అది కూడా పనిచేయకపోతే.. బేస్‌స్టేషన్‌ పనిచేయదు. వారం పొడవునా.. 24 గంటలపాటు నిరంతరాయంగా పనిచేసే అంతర్గత పవర్‌ బ్యాకప్‌ విధానం ఉండాలి. సర్వే ఆఫ్‌ ఇండియా వద్ద అది ఉంది. ఏపీ కార్స్‌లో లేదు. 

 

రిఫరెన్స్‌ స్టేషన్‌ నుంచి కంట్రోల్‌ సెంటర్‌కు డేటా వెళ్లడానికి ఉపయోగించుకునే కమ్యూనికేషన్‌ విధానం కూడా కీలకమే. అది ఎన్‌క్రిప్షన్‌ (గుట్టుగా) విధానంలో ఉండాలి. ఇందుకోసం à°“ వీపీఎన్‌ (వర్చువల్‌ ప్రైవేట్‌ నెట్‌వర్క్‌) కూడా ఉపయోగించుకోవచ్చు. బేస్‌స్టేషన్‌ నుంచి కంట్రోల్‌ సెంటర్‌కు డేటా అనేది à°…à°° సెకనులోనే చేరిపోవాలి. ఇందుకోసం లీజ్డ్‌ లైన్‌, ఆప్టికల్‌ ఫైబర్‌, వైర్‌లెస్‌ ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవాలి. అయితే ఏపీ బేస్‌స్టేషన్లకు ఇవేవీ లేవంటూ ఎస్‌వోఐ చెప్పకనే చెప్పింది.