ఏలూరులో సీఎం జగన్‌ సమీక్ష

Published: Tuesday December 08, 2020

‘‘అంతుతెలియని వ్యాధితో బాధపడుతున్న రోగుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసి ఇంటికి పంపినా కూడా, వారి ఆరోగ్యపరిస్థితిని గమనిస్తూ ఉండండి’’ అని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలోని బాధితులను సోమవారం ఆయన పరామర్శించారు. బాధితులతో మాట్లాడినప్పుడు.. ఒక్కొక్కరు ఒక్కో à°°à°•à°‚à°—à°¾ తమ అనుభవాలను ముఖ్యమంత్రితో పంచుకొన్నారు. అనంతరం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో అన్ని విభాగాల అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష జరిపారు. ఏలూరు నగరంలో వ్యాధి ప్రబలిన తీరుతెన్నులను కలెక్టర్‌ ముత్యాలరాజు, వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ కాటంనేని భాస్కర్‌ దాదాపు 25 నిమిషాల పాటు సీఎం జగన్‌కు వివరించారు.

 

వయస్సుతో నిమిత్తం లేకుండా సోమవారం ఉదయం నాటికి 340మందికి పైగా బాధితులు ఆస్పత్రుల్లో చేరారని, వీరిలో 168 మందిని వైద్యులు పరిశీలించి డిశ్చార్జి చేశారని కలెక్టర్‌ ముత్యాలరాజు వివరించారు. నగరంలో 62 వార్డు సచివాలయాలుండగా, వాటి పరిధిలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన వారి విషయంలో ఏం చేస్తున్నారని సీఎం ప్రశ్నించారు.  డిశ్చార్జి చేసిన వారిని కూడా పరిశీలనలో ఉంచాలని, వారికి సరైన ఆహారం, మంచి మందులు అందించాలని సీఎం ఆదేశించారు.

 

à°ˆ విషయంలో అధికారులు వేగంగా స్పందించాలన్నారు. ఆస్పత్రుల్లో చేరిన బాధితులందరి నుంచి శాంపిల్స్‌ సేకరించామని, ల్యాబ్‌లకు పంపి నివేదికలను రాబట్టామని కాటంనేని భాస్కర్‌ తెలిపారు.   à°¸à±‡à°•à°°à°¿à°‚à°šà°¿à°¨ శాంపిల్స్‌ మాటేమిటని సీఎం ప్రశ్నించగా,  దాదాపు అన్ని చోట్ల నీటిపరీక్షలు నిర్వహించామని, వీటిలో ఎలాంటి ప్రభావిత లక్షణాలు లేవని à°† నివేదికలు తెలిపాయన్నారు. కల్చర్‌ రిపోర్టు, వెన్నెపూస నుంచి తీసిన శాంపిళ్లకు సంబంధించిన పరీక్షల నివేదికలు రావడానికి మరో రోజు పడుతుందని నివేదించారు. మెదడు సంబంధిత ఇబ్బందులు ఏమైనా ఎదురవుతున్నాయా అని తెలుసుకునేందుకు సీటీ స్కాన్‌ పరీక్షలు నిర్వహించగా బాధితులందరికీ రిపోర్టు నార్మల్‌à°—à°¾ వచ్చిందని వివరించారు.

 

ఏలూరు దాటి కేసులునమోదు అయ్యాయా అని సీఎం ఆరా తీయగా, ఏలూరు అర్బన్‌లో 307, రూరల్‌ పరిధిలో 30, దెందులూరు మండల పరిధిలో మూడు కేసులు నమోదు అయ్యాయని, ఒక్క ఏలూరు నగరంలోనే దక్షిణపు వీధిలో 33 కేసులు నమోదు అయినా వీటిలో ఏ ఒక్క కేసూ ప్రమాదస్ధాయిలో లేదన్నారు. à°ˆ సమయంలో వైద్య సేవలు అందించేందుకు వీలుగా 108 హెల్ప్‌ లైన్‌ను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అనిల్‌కుమార్‌ సింఘల్‌ తెలిపారు. ఎవరికి ఏమి వచ్చినా 104, 108 నంబర్‌లకు కాల్‌ చేసేలా అవగాహన కల్పించాలని, కాల్‌ వచ్చిన వెంటనే వారికి వైద్యం అందే విధంగా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.