అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం.

Published: Monday December 14, 2020

 à°¨à°µà±à°¯à°¾à°‚ధ్ర రాజధాని అమరావతిపై à°—à°¤ కొన్ని నెలలుగా అధికార-విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న విషయం విదితమే. ఇప్పటికే పలుమార్లు కేంద్రంలోని, ఆంధ్రాలోని కమలనాథులు దీనిపై స్పందించారు. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతినిధిగా మాట్లాడుతూ అమరావతిపై తేల్చేశారు. సోమవారం నాడు గుంటూరు జిల్లా తుళ్లూరులో ‘భారతీయ కిసాన్ సంఘ్’ చిన్న, సన్నకారు రైతుల సమ్మేళనం జరిగింది. à°ˆ సమావేశానికి వీర్రాజు హాజరయ్యారు. à°ˆ సందర్భంగా అమరావతి గురించి మాట్లాడిన ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు.‘అమరావతిలోనే రాజధాని ఉండాలి అనేది బీజేపీ లక్ష్యం. ఇందులో రెండో అంశానికి తావు లేదు. ఏపీ బీజేపీ కార్యాలయం విజయవాడలోనే కడుతున్నాం. సీఎం మూడు రాజధానులు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మోదీ అమరావతి వైపే ఉన్నారనడానికి నిదర్శనం. 1800 కోట్లతో నిర్మితమవుతున్న ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిందా?. దుర్గమ్మ ఫ్లై ఓవర్ పూర్తీ చేసామా లేదా?. నేను మోదీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. బీజేపీ.. జగన్ లాగా మాట తప్పం...మడమ తిప్పం. బీజేపీ మాట తప్పే పార్టీ కాదు. అమరావతి ఇక్కడే ఉండాలి అని బీజేపీ పార్టీ తరుపున ఉద్యమం చేస్తాం. 2024లో బీజేపీకి ఏపీలో అధికారం ఇవ్వండి. అమరావతిని బాగా అభివృద్ధి చేసి చూపిస్తాం’ అని వీర్రాజు చెప్పుకొచ్చారు.