ప్రజలు మార్పు కోరుకుంటున్నారు ; అమిత్ షా

Published: Sunday December 20, 2020

ఈరోజు పశ్చిమ బెంగాల్‌లోని బోల్‌పూర్‌లో నిర్వహించినటువంటి రోడ్‌షోను తన జీవితంలో చూడలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ à°·à°¾ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం, ప్రభుత్వంపై ఉన్న నమ్మకం, ప్రేమ à°ˆ రోడ్‌షో ద్వారా కనిపించిందని ఆయన అన్నారు. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని దానికి ఇదే సాక్ష్యమని అమిత్ à°·à°¾ చెప్పుకొచ్చారు.

 

‘‘నా జీవితంలో ఎన్నో రోడ్‌షోలు చూశాను. చాలా ఏళ్లుగా దేశం మొత్తం తిరుగుతున్నాను. కానీ ఈరోజు బెంగాల్‌లో నిర్వహించిన ఇలాంటి రోడ్‌షోను నా జీవితంలో చూడలేదు. నరేంద్రమోదీపై ప్రేమకు నమ్మకానికి ఇది నిదర్శనం. ఇందులో బీజేపీపై ప్రజల ప్రేమ కనిపిస్తోంది. అలాగే దీదీపై (మమతా బెనర్జీ) కోపం కూడా స్పష్టంగా కనిపిస్తోంది. బెంగాల్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు’’ అని బోల్‌పూర్‌లో నిర్వహించిన రోడ్‌షోను ఉద్దేశించి అమిత్ à°·à°¾ అన్నారు.

 

వచ్చే ఏడాది ప్రథమార్థంలో బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో నిర్వహించిన à°ˆ ర్యాలీకి పార్టీ కార్యకర్తలతో పాటు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున్న హాజరయ్యారు. స్థానిక హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైన à°ˆ ర్యాలీకి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనం నుంచి అమిత్ à°·à°¾ అభివాదం చేస్తూ కనిపించారు. ఆయన వెంట బెంగాల్‌ బీజేపీకి చెందిన పలువురు నేతలు హాజరయ్యారు.