మోదీకి అమెరికా ప్రతిష్టాత్మక అవార్డు

Published: Tuesday December 22, 2020

డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం భారత ప్రధాని నరేంద్రమోదీని అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. ప్రతిష్టాత్మక ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును అందించింది. అమెరికాలోని భారత రాయబారి తరణ్‌జిత్ సింగ్ సంధూ.. ప్రధాని మోదీ తరఫున à°ˆ అవార్డును శ్వేతసౌధంలో స్వీకరించారు. యూఎస్ నేషనల్ సెక్రటరీ అడ్వైజర్ రాబర్డ్ ఓబ్రియన్ దీన్ని తరణ్‌జిత్ సింగ్ సంధూకు అందజేశారు. ఇండియా-అమెరికా మధ్య ద్వైపాక్షిక, వ్యూహాత్మక సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ప్రధాని మోదీ కృషి చేసినందుకు ఆయను à°ˆ అవార్డును ప్రకటించినట్టు ట్రంప్ ప్రభుత్వం తెలిపింది. 

 

à°ˆ సందర్భంగా రాబర్ట్ ఓబ్రియన్ మాట్లాడుతూ.. బలమైన ప్రజాస్వామ్యం కలిగిన భారతదేశానికి సారథ్యం వహిస్తున్న మోదీకి à°ˆ అవార్డును అందజేయడం తనకు గర్వకారణం అన్నారు. కాగా.. ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును యూఎస్ మిలటరీ విభాగంలో అత్యన్నత పురస్కారంగా భావిస్తారు. అయితే సాధారణంగా à°ˆ అవార్డును రాష్ట్రప్రభుత్వాధినేతలకు ఇస్తారు. ఇదిలా ఉంటే.. ‘లీజియన్ ఆఫ్ మెరిట్’ అవార్డును ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ మాజీ ప్రధాని షింజో అబేకు కూడా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించిందని రాబర్ట్ ఓబ్రియన్ ట్విట్టర్‌లో తెలిపారు. అమెరికాలోని ఆయా దేశాల ప్రతినిధులకు వాటిని అందజేయనున్నట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా, రష్యా, యూఏఈ తదితర దేశాల నుంచి ఆయా దేశాల ప్రతిష్టాత్మక  అవార్డులు గతంలో అందుకున్న విషయం తెలిసిందే.