పోలవరం.. గేట్ల బిగింపు ప్రక్రియ

Published: Tuesday December 22, 2020

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానమైన రేడియల్‌ గేట్ల అమరిక ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. 44-45 బ్లాక్‌à°² మధ్య తొలి గేటు అమర్చారు. 50 లక్షల క్యూసెక్కుల వరద నీటి తాకిడి తట్టుకునేలా à°ˆ గేట్లను తయారు చేశారు. సుమారు 275 టన్నుల స్టీల్‌తో 16 మీటర్ల వెడల్పు, 20.835 మీటర్ల ఎత్తుతో గేట్లను డిజైన్‌ చేశారు. క్రస్టు గేట్లకు   27.52 మీటర్ల ఎత్తున భారీ హైడ్రాలిక్‌ రేడియల్‌ గేట్లు అమర్చుతున్నారు. భారీ గేట్లు పైకి, కిందికి కదిలేందుకుగాను ఒక్కో గేటుకు రెండు హైడ్రాలిక్‌ సిలిండర్ల చొప్పున 48 గేట్లకు 96 హైడ్రాలిక్‌ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ద్వారా గేట్లను నిమిషానికి అరమీటరు చొప్పున పైకి ఎత్తి నీటిని విడుదల చేస్తారు. మొత్తం 48 గేట్ల అమరిక వచ్చే మే నాటికి పూర్తి చేయనున్నారు.