రైతుల ఖాతాల్లోకి పీఎం సాయం.

Published: Friday December 25, 2020

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం à°•à°¿à°‚à°¦ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి శుక్రవారం ఉదయం దేశవ్యాప్తంగా రైతులకు నిధులు బదిలీ అయ్యాయి. పీఎం కిసాన్ పథకం à°•à°¿à°‚à°¦ కేంద్రం వందశాతం ఇచ్చే సాయాన్ని వివిధ బ్యాంకుల ద్వారా రైతుల ఖాతాల్లో శుక్రవారం జమ అయ్యాయి. à°ˆ మేర రైతుల మొబైల్ ఫోన్లకు శుక్రవారం 11 గంటలకు డబ్బు జమ అయినట్లు మెసేజులు వచ్చాయి. 

 

à°ˆ పథకం à°•à°¿à°‚à°¦ తెలంగాణ రాష్ట్రంలో 39.17 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరిలో సాంకేతిక సమస్యల కారణంగా సగటున 37.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోనే డబ్బులు జమవుతున్నాయి. ప్రతి ఏడాదిలో మూడు విడతలుగా, ఒక్కో విడతకు రూ.2 వేల చొప్పున, ఏడాదికి రూ.6 వేలు కేంద్ర ప్రభుత్వం à°ˆ పథకంలో రైతులకు ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఏప్రిల్‌-జూలై మధ్యలో మొదటి విడత, ఆగస్టు నుంచి నవంబరు మధ్యలో రెండో విడత, డిసెంబరు నుంచి మార్చి వరకు మూడో విడత చెల్లింపులు చేస్తోంది. à°ˆ వార్షిక సంవత్సరానికి గాను (2020- 21) ఇప్పటి వరకు రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో కేంద్రం డబ్బులు జమ చేసింది. 

 

 

ప్రధాని మోదీ ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు. రైతులకు పెట్టుబడి సాయం కింద ప్రధాని ఈ నిధులు అందిస్తున్నారు. ఒక్కో రైతుకు 6వేల రూపాయలు సాయం అందే ఈ పథకం కింద మూడు వాయిదాల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారు. సాగు భూమి ఉన్న రైతులందరికీ ఈ పథకం కింద పెట్టుబడి సాయం అందింది. శుక్రవారం 9 కోట్ల మంది రైతులకు రూ.18,000కోట్లను బదిలీ చేశామని ప్రధాని మోదీ ప్రకటించారు.